Ahmedabad IIM Report: దేశంలో కరోనా మరణాలు 32 లక్షలకు పైనే.. సంచలనం రేపుతున్న సర్వే
Ahmedabad IIM Report: కరోనా మహమ్మారి ఇప్పటి వరకూ రెండు దశల్లో భయకంపితుల్ని చేసింది. ఇప్పుడు మూడవ దశ విస్తరిస్తూ ఆందోళన కల్గిస్తోంది. ఈ క్రమంలో అహ్మాదాబాద్ ఐఐఎం వెల్లడించిన నివేదిక సంచలనం రేపుతోంది. ఆ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
Ahmedabad IIM Report: కరోనా మహమ్మారి ఇప్పటి వరకూ రెండు దశల్లో భయకంపితుల్ని చేసింది. ఇప్పుడు మూడవ దశ విస్తరిస్తూ ఆందోళన కల్గిస్తోంది. ఈ క్రమంలో అహ్మాదాబాద్ ఐఐఎం వెల్లడించిన నివేదిక సంచలనం రేపుతోంది. ఆ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
దేశంలో కరోనా మహమ్మారి ప్రారంభమై రెండేళ్లు పూర్తవుతున్నాయి. కరోనా ఫస్ట్‌వేవ్, సెకండ్ వేవ్‌లతో దేశం విలవిల్లాడింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అంతా నరకంగా మారింది. వేలల్లో ప్రాణాలు పోయాయి. ఈ నేపధ్యంలో దేశంలో ఇప్పటి వరకూ సంభవించిన కరోనా మరణాలపై ప్రభుత్వ లెక్కలకు, వాస్తవానికి చాలా వ్యత్యాసముందని తెలుస్తోంది. ఐఐఎం అహ్మదాబాద్ ఈ సంచలన విషయాలు వెల్లడించింది.
దేశంలో అధికారిక లెక్కల ప్రకారం కరోనా మరణాలు (Indida Corona Deaths) దాదాపు ఐదు లక్షలున్నాయి. అయితే ఈ లెక్కల కంటే 6-7 రెట్లు అధికంగా ఉండవచ్చనేది తాజాగా అహ్మదాబాద్ ఐఐఎం (Ahmedabad IIM) చేసిన అధ్యయనం చెబుతోంది. 2021 సెప్టెంబర్ నాటికే కోవిడ్ మరణాలు దేశంలో 32 లక్షల వరకూ ఉండవచ్చని అంచనా. డెల్టా వేరియంట్ ప్రభావానికి రోజువారీ కేసుల సంఖ్య అత్యధికంగా 4 లక్షలకు చేరింది. లక్షలాదిమంది కోవిడ్ బాధితులతో దేశంలోని అన్ని ఆసుపత్రులు కిటకిటలాడాయి. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరతతో జనం విలవిల్లాడి పోయారు. ఆ సమయంలో కెనడాలోని యూనివర్శిటీ ఆఫ్ టొరంటోకు చెందిన ప్రొఫెసర్ ప్రభాత్ ఝా నేతృత్వంలో జరిగిన సర్వే వివరాలివి. జర్నల్ సైన్స్‌లో (Journal Science) ఐఐఎం అహ్మదాబాద్ వెల్లడించింది.
2020 మార్చ్ నుంచి 2021 జూలై మధ్యకాలంలో చేపట్టిన ఈ సర్వేలో 1 లక్షా 37 వేలమంది నుంచి వివరాలు సేకరించారు. మొత్తం మరణాల్లో 32 లక్షల మరణాలు కోవిడ్ కారణంగానే జరిగినట్టు అంచనా. 2021 ఏప్రిల్-జూలై మధ్యకాలంలోనే 27 లక్షలమంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా వేశారు. ఎందుకంటే వివిధ కారణాలతో సంభవించే మరణాలను కోవిడ్ ముందున్న మరణాలతో పోలిస్తే..27 శాతం పెరిగినట్టు సర్వేలో గుర్తించారు. 2021 సెప్టెంబర్ వరకూ దేశంలో ఏకంగా 32 లక్షలమంది మరణించి ఉండవచ్చనే ఈ అధ్యయం ఇప్పుడు సంచలనం రేపుతోంది.
Also read: Paracetamol not recommended : వ్యాక్సినేషన్ తర్వాత ఆ ట్యాబ్లెట్ అస్సలు వాడొద్దు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook