NCERT Books: అక్రమ దందా.. రూ.35కోట్ల పుస్తకాల సీజ్
కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి కారణంగా దేశంలో ఇంకా విద్యాసంవత్సరమే ప్రారంభం కాలేదు. పిల్లల చదువులు, కరోనా గురించి విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే ఈ క్రమంలో భారీ స్థాయిలో అక్రమంగా ముద్రించిన పుస్తకాలు పట్టుబడటం సర్వత్రా చర్చనీయాంశమైంది.
illegally printed NCERT books: న్యూఢిల్లీ: కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి కారణంగా దేశంలో ఇంకా విద్యాసంవత్సరమే ప్రారంభం కాలేదు. పిల్లల చదువులు, కరోనా గురించి విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే ఈ క్రమంలో భారీ స్థాయిలో అక్రమంగా ముద్రించిన పుస్తకాలు పట్టుబడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh ) లోని మీరట్ జిల్లా పార్తాపూర్‌లోని ఓ గోదాంలో అక్రమంగా ముద్రించి నిల్వ ఉంచిన రూ.35 కోట్ల విలువ చేసే ఎన్‌సీఈఆర్టీ ( NCERT ) పుస్తకాలను స్పెషల్ టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తదితర రాష్ట్రాల్లో ఈ పుస్తకాలకు ఎక్కువగా డిమాండ్ ఉన్నందున చట్టవిరుద్ధంగా వీటిని ముద్రించి అత్యధిక ధరలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. Also read: Chiranjeevi: హ్యాపీ బర్త్ డే మెగాస్టార్
గోదాంలో ఉన్న పుస్తకాలతోపాటు ఆరు ప్రింటింగ్ మిషన్లను సీజ్ చేసినట్లు జిల్లా ఎస్‌ఎస్‌పీ అజయ్ సాహ్ని తెలిపారు. ఈ దందాకు పాల్పడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ దాందా ప్రధాన నిందితుడు సచిన్ గుప్తాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని.. గత కొంత కాలంగా ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. చట్టవిరుద్దంగా అనేక రాష్ట్రాలకు ఈ అక్రమ ఎన్సీఈఆర్టీ పుస్తకాలను సరఫరా చేసి కోట్లాది రూపాయలను అడ్డదారిలో సంపాదిస్తున్నారని వివరించారు. Also read: Election Commission: భారత నూతన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్