Yaas Cyclone Update: బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను మరో 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుంది. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఆక్సిజన్ సరఫరాకు ఇబ్బంది రాకుండా ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తూర్పు మధ్య బంగాళాఖాతంలో(Bay of Bengal) వాయుగుండం కొనసాగుతోంది. మరో 12 గంటల్లో బలపడి తీవ్ర తుపానుగానూ..24 గంటల్లో అతి తీవ్ర తుపానుగానూ మారనుంది. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో 620 కిలోమీటర్ల దూరంలో..పోర్ట్ బ్లేయర్‌కు వాయవ్యదిశలో 530 కిలోమీటర్ల దూరంలోనూ, ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయదిశలో 620 కిలోమీటర్ల దూరంలోనూ  వాయువ్య దిశలో బెంగాల్ వైపుకు కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తోంది. ఈనెల 26వ తేదీన ఉత్తర ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటనుంది. ఆ సమయంలో గంటకు 155 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. యాస్ తుపాను ప్రభావం ఉత్తర ఒడిశా, దక్షిణ బెంగాల్‌పై తీవ్రంగా ఉండనుంది. తీరం దాటాక రాంచీ వైపుగా తుపాను పయనించనుంది. యాస్ తుపాను ప్రభావం ఏపీ(AP)లో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో పడనుంది. ఈ జిల్లాల్లో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.


యాస్ తుపాను (Yaas Cyclone) నేపధ్యంలో శ్రీకాకుళంలో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సాయంత్రం నుంచి తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఆక్సిజన్(Oxygen) వాహనాలు ట్రాఫిక్‌లో, తుపానులో చిక్కుకోకుండా అప్రమత్తమవుతున్నారు. రైతులు పంటల్ని కోసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, విద్యుత్ పునరుద్ధరణ, వైద్య శిబిరాల ఏర్పాటుపై సిద్ధంగా ఉండాలన్నారు.


Also read: Yaas Cyclone Alert: యాస్ తుపానుపై ముఖ్యమంత్రులతో అమిత్ షా సమీక్ష


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook