8th Pay Commission latest Updates: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర ఉద్యోగులు 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు జీతాలు పొందుతున్నారు. అయితే తమకు సిఫార్సు చేసిన దానికంటే తక్కువ వేతనాలు లభిస్తున్నాయని ఉద్యోగులు ఎప్పటి నుంచో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మెమోరాండం సిద్ధం చేస్తున్నామని త్వరలోనే ప్రభుత్వానికి అందజేస్తామని ఉద్యోగుల సంఘాలు చెబుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మెమోరాండంలో సిఫారసుల ప్రకారం జీతం పెంచాలని లేదా 8వ వేతన సంఘం తీసుకురావాలని ఉద్యోగుల సంఘాల నుంచి డిమాండ్ ఉంటుంది. అయితే మరోవైపు సభలో 8వ వేతన స్కేలు అమలు చేసే అంశంపై ఎలాంటి పరిశీలన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇంత జరిగినా ప్రభుత్వం దీనిపై చర్చిస్తుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


కనీస వేతనం ఎంత ఉంటుంది  


ప్రస్తుతం కనీస వేతన పరిమితిని రూ.18 వేలుగా ఉంచినట్లు కేంద్ర ఉద్యోగుల సంస్థలు చెబుతున్నాయి. ఇందులో ఇంక్రిమెంట్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం ఇది 2.57 రెట్లు ఉండగా, 7వ వేతన సంఘంలో దీన్ని 3.68 రెట్లు పెంచాలని సిఫార్సు చేశారు. దీనికి ప్రభుత్వం అంగీకరిస్తే ఉద్యోగుల కనీస వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెరగనుంది. 


4వ పే కమిషన్ జీతం ఎంత పెరిగింది


పెంపు: 27.6%
కనీస పే స్కేల్: రూ.750


5వ వేతన సంఘం ద్వారా ఎంత జీతం పెరిగింది


పెంపు:31%
కనీస పే స్కేల్: రూ.2,550 


6వ పే కమిషన్ పెరిగిన జీతం (ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్)


ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్: 1.86 రెట్లు
ఇంక్రిమెంట్: 54%
కనీస వేతన స్కేల్: రూ.7 వేలు


7వ పే కమిషన్ జీతం ఎంత పెరుగుతుంది..? (ఫిట్‌నెస్ ఫ్యాక్టర్)


ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్: 2.57 రెట్లు
ఇంక్రిమెంట్: 14.29%
కనీస వేతన స్కేల్: రూ.18 వేలు 


8వ పే కమిషన్ జీతం ఎంత పెరుగుతుంది..? (ఫిట్‌నెస్ ఫ్యాక్టర్)


ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్: 3.68 రెట్లు సాధ్యం
ఇంక్రిమెంట్: 44.44%
కనీస వేతన స్కేల్: రూ.26 వేల వరకు పెరిగే అవకాశం  


ప్రభుత్వం కూడా ఉద్యోగులను ఆదుకునే ప్రయత్నంలో ఉంది. 7వ వేతన సంఘం తర్వాత ఇప్పుడు కొత్త వేతన సంఘం రాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అందుకు బదులుగా మరో విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పద్ధతి వల్ల ఉద్యోగుల జీతం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఇది 'ఆటోమేటిక్ పే రివిజన్ సిస్టమ్' కావచ్చని కొందరు చెబుతున్నారు. ఇందులో డీఏ 50 శాతం కంటే ఎక్కువ ఉంటే జీతంలో ఆటోమేటిక్ రివిజన్ ఉంటుంది. ఇదే జరిగితే  68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 52 లక్షల మంది పెన్షనర్లు ప్రత్యక్ష ప్రయోజనం పొందనున్నారు. 


జీతాల పెంపు డిమాండ్లకు సంబంధించి త్వరలో నోట్‌ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సెంట్రల్ ఎంప్లాయీస్ యూనియన్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించని పక్షంలో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగుతాయని ముందే హెచ్చరించారు. ఈ ఉద్యమంలో ఉద్యోగులతో పాటు పింఛను పొందే ముందు కార్మికులు కూడా పాల్గొంటారని తెలిపారు. 


Also Read: Super Star Krishna Funeral: ఒకే ఫ్రేమ్‌లో సీఎం జగన్, బాలయ్య.. సూపర్ స్టార్ కృష్ణకు నివాళి  


Also Read: SBI ATM Withdrawal: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. క్యాష్‌ విత్ డ్రాకు రూల్ ఛేంజ్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి