బడ్జెట్‌పై అవగాహన మనమూ పెంచేసుకుందాం..!
`బడ్జెట్ 2018`ను మరికొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ఆదాయ, వ్యయాలతో పాటు రానున్న కొత్త పథకాలు.. అందుకయ్యే ఖర్చులు, రాష్ట్రాలకు జరిగే కేటాయింపులు మొదలైన సమాచారం కోసం యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో బడ్జెట్ పై అవగాహన కోసం పలు ముఖ్య పదాలపై మనం కూడా అవగాహన పెంచుకుందాం..!
'బడ్జెట్ 2018'ను మరికొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ఆదాయ, వ్యయాలతో పాటు రానున్న కొత్త పథకాలు.. అందుకయ్యే ఖర్చులు, రాష్ట్రాలకు జరిగే కేటాయింపులు మొదలైన సమాచారం కోసం యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో బడ్జెట్ పై అవగాహన కోసం పలు ముఖ్య పదాలపై మనం కూడా అవగాహన పెంచుకుందాం..!
బ్యాలెన్స్ షీట్: ఒక సంవత్సర కాలం పాటు ప్రభుత్వం చేసిన పనులను ఇది విశ్లేషిస్తుంది. అందులో ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలు ఉంటాయి. అలాగే వివిధ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టిన వాటి లెక్కలు కూడా ఉంటాయి.
ఏకీకృత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) - ప్రభుత్వం ప్రతీ సంవత్సరం వివిధ మార్గాల ద్వారా రుణాలు తీసుకుంటుంది. అదే సమయంలో ఆ రుణాల నుండి కొంత మొత్తాన్ని ఆదాయం కోసం వేరేవాటిలో పెట్టుబడిగా కూడా పెడుతుంది. రాష్ట్రాలకు కేంద్రం కేటాయించే నిధులు కూడా ఏకీకృత నిధి నుండే మంజూరు అవుతాయి
సంఘటిత నిధి (కంటిన్‌జెన్సీ ఫండ్) - ఈ ఫండ్ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఎంతో అత్యవసరమైన ఖర్చులుంటే తప్ప ఇందులో నుండి నిధులను మళ్లించరు. ఈ ఫండ్‌లో రూ.500 కోట్లు డిపాజిట్ ఉంటుంది. ఈ నిధులు తీయాలంటే పార్లమెంట్ ఆమోద ముద్ర వేయాలి.
ట్రెజరీ బిల్లు - సాధారణంగా ఏడాది లోపు స్వల్పకాలిక అవసరాల కోసం డబ్బును ప్రభుత్వం వాడితే అందుకు బిల్లులు సమర్పించాలి. అవే ట్రెజరీ బిల్లులు. స్వల్పకాలిక అవసరాల కోసం ప్రభుత్వానికి డబ్బు కావాలి కాబట్టి... ఆ డబ్బును ప్రభుత్వం కేపిటలిస్టుల నుండి నిధుల రూపంలో సేకరించవచ్చు. మదుపర్లు కూడా ఈ నిధుల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. అలా పెట్టుబడులు పెట్టేటప్పుడు బాండ్లు ఇస్తారు. భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణీత కాలం గడిచాక ఆ బాండ్లను వేలం వేస్తుంది.
పబ్లిక్ అకౌంట్స్: ఈ నిధులు ప్రభుత్వానికి చెందినవి కావు. ప్రజలకు సంబంధించిన నిధులుగా వీటిని పరిగణించవచ్చు. ఉదాహరణకు ప్రావిడెంట్ ఫండ్లు, చిన్న మొత్తాల పొదుపు మొదలైనవి అన్నీ కూడా పబ్లిక్ అకౌంట్స్ క్రిందకే వస్తాయి. ఈ ఖాతా నుండి ఖర్చు చేసే నిధులకు పార్లమెంట్ ఆమోదం అవసరం లేదు.
ప్రత్యక్ష పన్ను - దేశంలో ప్రతీ వ్యక్తి తనకు వచ్చే ఆదాయంలో కొంత ప్రభుత్వానికి పన్ను రూపేణా చెల్లించాలి. అదే ప్రత్యక్ష పన్ను. ఎఫ్‌బీటీ, ఎస్‌టీటీ, సీటీటీ సుంకాలను మనం వీటికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
పరోక్ష పన్ను - దేశంలో పౌరులు తాము పొందే సేవలపై కూడా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అదే పరోక్ష పన్ను. కస్టమ్, ఎక్సైజ్ ట్యాక్సులు, సర్వీస్ ట్యాక్స్‌లు మొదలైనవాటిని వీటికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
కార్పొరేషన్ పన్ను - దేశంలోని పరిశ్రమలు లాభాల బాటలో పయనించినప్పుడు.. వాటిలో కూడా కొంత మొత్తం ప్రభుత్వానికి పన్ను రూపేణా చెల్లించాలి. అదే కార్పొరేషన్ ట్యాక్స్.