ఇకపై 24 గంటల్లో ఇన్కమ్ టాక్స్ రిఫండ్స్ ప్రాసెస్
ఇకపై 24 గంటల్లో ఇన్కమ్ టాక్స్ రిఫండ్స్ ప్రాసెస్
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిఫండ్స్‌ను 24 గంటల్లోనే పరిష్కరించి, సత్వరమే నిధులు విడుదల చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. అంతేకాకుండా రానున్న రెండేళ్లలో అన్నిరకాల టాక్స్ రిటర్న్స్ లెక్కింపును పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి స్పష్టంచేశారు. నేడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే క్రమంలో మంత్రి పీయుష్ గోయల్ ఈ ప్రకటన చేశారు.
2013-14లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ. 6.38 లక్షల కోట్లుగా వుండగా ప్రస్తుతం ఆ మొత్తం రూ.12 లక్షల కోట్లకు చేరిందని ఈ సందర్భంగా మంత్రి సభకు వెల్లడించారు.