Union Govt: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశాన్ని రాజ్యసభ ముందుకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీసుకొచ్చారు. దీనికి కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. నియోజకవర్గాల పెంపుపై 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండక తప్పదన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం-2014లో ఉన్న నియోజకవర్గాల పెంపు అంశాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం-2014లోని సెక్షన్‌ 26(1), రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి..విభజన చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం శాసన సభ సీట్లను పెంచుకునే అవకాశం ఉందని కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. ఏపీలో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచుకోవచ్చన్నారు. 


కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం, 2026 మొదటి జనాభా గణన చేసే వరకు ఏ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచే వీలు లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం-2014లోని సెక్షన్ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించే వరకు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంచలేమని రాజ్యసభలో తేల్చి చెప్పారు. దీంతో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉంటుందని అనుకున్న పార్టీలకు షాక్‌ తగినట్లు అయ్యింది.


Also read:AP Govt: ఇక అవినీతిపై ఉక్కుపాదమే..సరికొత్త యాప్‌ తీసుకొచ్చిన ఏపీ సర్కార్..!


Also read:Monkeypox: తెలంగాణలో మంకీపాక్స్‌ టెర్రర్..తాజాగా మరో అనుమానిత కేసు నమోదు..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook