AP Govt: ఇక అవినీతిపై ఉక్కుపాదమే..సరికొత్త యాప్‌ తీసుకొచ్చిన ఏపీ సర్కార్..!

AP Govt: ఏపీలో జగన్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. అవినీతిపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. 

Written by - Alla Swamy | Last Updated : Jul 27, 2022, 02:57 PM IST
  • ఏపీలో మరో విప్లవాత్మక నిర్ణయం
  • అవినీతిపై ఉక్కుపాదం
  • అందుబాటులోకి సరికొత్త యాప్
AP Govt: ఇక అవినీతిపై ఉక్కుపాదమే..సరికొత్త యాప్‌ తీసుకొచ్చిన ఏపీ సర్కార్..!

AP Govt: సీఎం వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతికి చెక్ పెట్టేలా విప్లవాత్మక అడుగు వేశారు. ఇందులోభాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అనే మాటకు తావు లేకుండా చేస్తోంది. ఈక్రమంలోనే టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. తాజాగా ఏసీబీ 14400 అనే యాప్‌ను తీసుకొచ్చారు. యాప్‌ ద్వారా ప్రభుత్వ శాఖల్లో ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయవచ్చు. 

ఇందు కోసం ఎవరి దగ్గరికి వెళ్లకుండా నేరుగా యాప్‌లోనే సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు. దీనిపై సీఎస్ సమీర్ శర్మ ఆరా తీశారు. ఏసీబీ 14400 కాల్ సర్వీసులు, ఏసీబీ యాప్‌ను పరిశీలించారు. 14400 సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇందులోభాగంగా క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు సీఎస్ సమీర్ శర్మ. ఏసీబీ యాప్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో డిస్‌ప్లే బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.

ఈయాప్‌లో వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలతో ఫిర్యాదులు చేసుకోవచ్చని తెలిపారు. 14400కు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే దానికి సంబంధించిన పత్రాలు ఫిర్యాదుదారుడికి వెళ్లతాయని వెల్లడించారు. 

Also read:Corona Updates in India: దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు..తాజాగా కేసులు ఎన్నంటే..!

Also read:CM Jagan: కేంద్రంపై యుద్ధం చేస్తున్నాం..పోలవరం ప్రాజెక్ట్‌పై సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News