Corona Virus: కోలుకుంటున్నఢిల్లీ, పెరిగిన రికవరీ రేటు
దేశమంతటా కరోనా కేసులు ( Corona cases ) విజృంభిస్తున్న తరుణంలో రాజధాని నగరం ఢిల్లీ ( Delhi Capital ) పరిస్థితి ఆశాజనకంగా కన్పిస్తోంది. నిన్నటి వరకూ కరోనా హాట్ స్పాట్ ( Corona Hotspot ) గా ఉన్న ఢిల్లీ ఇప్పుడు కోలుకుంటోంది. రికవరీ రేటు పెరగడం ఊరట కల్గిస్తోంది.
దేశమంతటా కరోనా కేసులు ( Corona cases ) విజృంభిస్తున్న తరుణంలో రాజధాని నగరం ఢిల్లీ ( Delhi Capital ) పరిస్థితి ఆశాజనకంగా కన్పిస్తోంది. నిన్నటి వరకూ కరోనా హాట్ స్పాట్ ( Corona Hotspot ) గా ఉన్న ఢిల్లీ ఇప్పుడు కోలుకుంటోంది. రికవరీ రేటు పెరగడం ఊరట కల్గిస్తోంది.
దేశంలోనే అత్యధిక కరోనా ప్రభావిత ప్రాంతంగా నిన్నటి వరకూ చెప్పుకున్న రాజధాని ఢిల్లీలో ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడుతున్నట్టు కన్పిస్తోంది. నిన్నటి వరకూ ఢిల్లీ కరోనా హాట్ స్పాట్. ఇప్పుడు అందులోంచి బయటపడుతోంది. ఢిల్లీలో కోవిడ్ 19 వైరస్ ( Covid19 Virus ) తీవ్రత తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Delhi Cm Aravind Kejriwal ) స్పష్టం చేశారు. రోజురోజుకూ వెలుగుచూస్తున్న కేసుల సంఖ్య ఓ వైపు తగ్గుతోంది. మరోవైపు ఆసుపత్రుల్లో పడకల ఆక్యుపెన్సీ రేటు తగ్గుతోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఢిల్లీలో కేసుల సంఖ్య చాలా తగ్గిందని కేజ్రీవాల్ తెలిపారు. ముఖ్యంగా గత మూడు నాలుగు రోజులుగా ఢిల్లీ ఆసుపత్రుల్లో ఆక్సుపెన్సీ రేటు భారీగా పడిపోయిందన్నారు. ఎక్కువ మంది ఇంటివద్దే చికిత్స పొందుతున్నారని...ఆసుపత్రుల్లో చేరే పరిస్థితి చాలా తక్కువ మందికి ఎదురవుతోందన్నారు. ఫలితంగా ఆసుపత్రుపై ఒత్తిడి తగ్గుతుందని కేజ్రీవాల్ వివరించారు. Also read: Covid 1: అన్‌లాక్ 3లో అవి ప్రారంభమవుతాయా
ప్రస్తుతం ఢిల్లీ...కరోనా యాక్టివ్ కేసుల ( Delhi Active Cases ) విషయంలో 8వ స్థానంలో ఉంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 29 వేలకు చేరుకుంది. మరణాల సంఖ్య 3 వేల 806గా ఉంది. ఇక రికవరీ రేటు 87 శాతం ఉండటం మెరుగైన పరిణామమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. Also read:Madras IIT: ఆ బ్యాండ్ ధరిస్తే చాలు..కరోనా ఉందో లేదో తెలుస్తుంది