Composite Cylinder: దేశంలో LPG గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే రూ.900లకు పైగా పెరిగిన పోయిన గ్యాస్ ధరలతో సామాన్యుడికి భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఇండేన్ గ్యాస్ (Indane) సంస్థ కస్టమర్లను ఆకర్షించేందుకు ఓ ప్రత్యేకమైన ఆఫర్ తో ముందుకొచ్చింది. కేవలం రూ.633.5 ధరకే LPG సిలిండర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇది సాధారణ సిలిండర్ కాదు.. మామూలు సిలిండర్ కంటే కొంచెం తక్కువ బరువు కలిగిన కాంపోజిట్ గ్యాస్ సిలిండర్. దీనిపై ప్లాస్టిక్ తొడుగు ఉంటుంది. మిగిలిన గ్యాస్ సిలిండర్ల లాగా ఇది తుప్పు పట్టదు. అయితే ఆ కాంపోజిట్ సిలిండర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. 


కాంపోజిట్ సిలిండర్ ప్రయోజనాలు


ఇండేన్ ప్రవేశపెట్టిన కొత్త కాంపోజిట్ సిలిండర్ (LPG కాంపోజిట్ సిలిండర్) తుప్పు పట్టదు. సాధారణ LPG సిలిండర్ కోసం దాదాపుగా రూ.900లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ కాంపోజిట్ సిలిండర్ కోసం కేవలం రూ.633.50 చెల్లిస్తే సరిపోతుంది. 


వాస్తవానికి ఈ సిలిండర్ లో గ్యాస్ 10 కిలోల బరువును కలిగి ఉంటుంది. ఈ కాంపోజిట్ సిలిండర్ ప్రత్యేక ఏమిటంటే.. దీన్ని సులభంగా తీసుకెళ్లొచ్చు. తక్కువ మంది ఉన్నకుటుంబంలో ఈ గ్యాస్ సిలిండర్ చాలా సౌకర్యంగా ఉంటుంది. 


సిలిండర్ ప్రత్యేకత


కాంపోజిట్ LPG సిలిండర్ బరువు దాదాపు 15 కిలోలు, ఇది ప్రస్తుతం ఉన్న స్టీల్ డొమెస్టిక్ సిలిండర్‌లో దాదాపు సగం బరువుండేది.


ఖాళీ సిలిండర్ 5 కిలోలు


10 కిలోల గ్యాస్ నింపిన తర్వాత, ఈ కాంపోజిట్ గ్యాస్ సిలిండర్ మొత్తం బరువు 15 కిలోలు అవుతుంది. మహిళలు, వృద్ధులు.. ఈ కాంపోజిట్ సిలిండర్లను ఉపయోగించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. 


అగ్నిప్రమాదం జరిగితే పేలదు


కాంపోజిట్ గ్యాస్ సిలిండర్ రెండు రకాలు, ఒకటి 10 కిలోలు, మరొకటి 5 కిలోలు అందుబాటులో ఉంటుంది.


కాంపోజిట్ LPG గ్యాస్ సిలిండర్లు తుప్పు పట్టదు, ఎందుకంటే దీని పైనిర్మాణం ప్లాస్టిక్ తో ఉంటుంది. 


28 నగరాల్లో అందుబాటులో


ఇండియన్ ఆయిల్ సంస్థ ప్రకారం.. 10 కిలోల గ్యాస్ తో కూడిన కాంపోజిట్ గ్యాస్ సిలిండర్ ముంబయిలో రూ.634, కోల్ కతాలో రూ.652, చెన్నైలో రూ.645, లక్నోలో రూ.660కి విక్రయిస్తున్నారు. 


అదే సమయంలో ఇండోర్‌లో రూ.653, భోపాల్‌లో రూ.638, గోరఖ్‌పూర్‌లో రూ.677, పాట్నాలో దాదాపు రూ.697గా ఉంది. ప్రస్తుతం ఇది దేశంలోని 28 నగరాల్లో అందుబాటులో ఉంది. త్వరలో దేశంలోని ఇతర నగరాల్లోనూ అందుబాటులోకి వస్తుందని ఇండియన్ ఆయిల్ సంస్థ పేర్కొంది.  


Also Read:Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే


Also Read: Digital Payment Without Internet: ఇకపై ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ పేమెంట్స్- ఎలానో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.