Firing between India and China troops: ఢిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా భారత సైన్యంపై దురాఘాతానికి పాల్పడ్డ నాటినుంచి సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా.. ఇరుదేశాల మధ్య కాల్పులు జరిగినట్లు సమాచారం. తూర్పు లడఖ్‌ సెక్టార్‌లోని ఎల్‌ఏసీలో భారత్‌, చైనా బలగాల మధ్య సోమవారం అర్ధరాత్రి కాల్పులు జరిగినట్లు సమాచారం. అయితే.. మొదట భారత సైన్యమే వాస్తవ నియంత్రణ రేఖను దాటిందని.. లడఖ్‌లోని పంగోంగ్ త్సో సరస్సు ఒడ్డున కాల్పులు జరిపిందంటూ చైనా మంగళవారం ఉదయం ఆరోపించింది. భారత్ ఇరుపక్షాల మధ్య ఒప్పందాలను ఉల్లంఘించినట్లు చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ఇదిలాఉంటే.. కాల్పులపై  భారత్‌ ఇంకా స్పందించలేదు. Also read: Indian Army: దారి తప్పిన చైనా పౌరులను ఆదుకున్న భారత సైన్యం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూన్‌లో గల్వాన్‌ లోయలో చైనా సైన్యం హింసాత్మక ఘర్షణకు దిగి 20మంది సైనికులను పొట్టనబెట్టుకుంది. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య పరిస్థితి మరింత దిగజారింది. ఈ క్రమంలో గత మూడు నెలలుగా రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.