India Corona Cases Today: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 44 రోజుల తరువాత కరోనా పాజిటివ్ కేసులు కనిష్టంగా నమోదయ్యాయి. ఈ వారం ఓ రోజు వ్యవధిలో 2 లక్షల దిగువకు మరోసారి పాజిటివ్ నమోదు కావడం కాస్త ఊరటనిస్తోంది. వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ల కొరత కారణంగా వ్యాక్సినేషన్ సరిగా జరగడం లేదని తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,86,364 మంది కరోనా బారిన పడ్డారు. ఓ రోజు వ్యవధిలో నమోదైన కోవిడ్ కేసులలో 44 రోజులు ఇదే కనిష్టం కావడం గమనార్హం. తాజా కేసులతో కలిపితే భారత్‌లో ఇప్పటివరకూ మొత్తం కరోనా బాధితుల సంఖ్య (India Corona Cases) 2,75,55,457 (2 కోట్ల 75 లక్షల 55 వేల 4 వందల 57)కు చేరుకుంది. అదే సమయంలో కోవిడ్19 (Covid-19)తో పోరాడుతూ మరో 3,660 మంది మరణించారు. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,18,895కి చేరింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నేటి ఉదయం హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది.


Also Read: Health Tips: మామిడి పండు తిన్నాక ఈ పదార్థాలు తినకూడదు, నిర్లక్ష్యానికి మూల్యం తప్పదు


గడిచిన 24 గంటల్లో 2,59,459 (2 లక్షల 59 వేల 4 వందల 59) మంది కోవిడ్19 బారి నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 2,48,93,410 (2 కోట్ల 48 లక్షల 93 వేల 410) మంది కరోనా వైరస్ మహమ్మారిని జయించారు. కరోనా వైరస్ (CoronaVirus) నుంచి కోలుకున్న వారి రేటు 90 శాతానికి చేరుకుంది.  దేశంలో ప్రస్తుతం 23,43,152 (23 లక్షల 43 వేల 152) యాక్టివ్ కరోనా కేసులున్నాయి. కరోనా కేసుల పాజిటివిటీ రేటు 9 శాతానికి తగ్గింది.


Also Read: COVID-19 Infections: కరోనా వ్యాక్సిన్ల ప్రభావంపై సర్వేలో సీడీసీ ఆసక్తికర విషయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook