India Corona Cases: దేశంలో రెండింతలు పెరిగిన కరోనా కేసులు.. కరోనా ఫోర్త్ వేవ్ తప్పదా?
India Corona Cases Today: దేశంలో కరోనా వైరస్ ఫోర్త్ వేవ్ రాక తప్పదని నిపుణులు అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు అమాతంగా రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో మరోమారు కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
India Corona Cases Today: భారతదేశ రోజువారీ కరోనా కేసుల్లో సోమవారం భారీ పెరుగుదల వెలుగుచూసింది. ఒకేసారి 90 శాతానికి పైగా కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,183 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మరోసారి అధికారులతో సహా ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్ తప్పదని నిపుణలు చెబుతున్నారు. మరోవైపు దేశంలో కొత్తగా 200 పైగా మరణాలు నమోదయ్యాయి.
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య 4,30,44,280కి చేరుకోగా.. యాక్టివ్ కేసులు 11,542కి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లోనే అత్యధికంగా కేరళలో 940 కరోనా కేసులు, ఢిల్లీలో 517 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
దేశంలో ఇప్పటివరకు 4.30 కోట్ల మందికి పైగా కరోనా వైరస్ సోకిందని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు కొత్తగా 1,985 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11,542 గా ఉన్నాయి. ఇప్పుడు రికవరీ రేట్ 98.76గా ఉంది.
ఢిల్లీలో కరోనా కలకలం..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కల్గిస్తోంది. రోజువారి కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఢిల్లీ నగర పరిసరాల్లో 15 రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపు అయ్యిందని ఓ సర్వేలో తేలింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా ఆంక్షలను మరోసారి కఠినతరం చేసేందుకు సిద్ధమవుతోంది.
Also Read: Corona Fourth Wave: ఢిల్లీలో కరోనా ఫోర్త్‌వేవ్ భయం, ఆదివారం ఒక్కరోజే 517 కొత్త కేసులు
Also Read: PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన 11 విడత నిధుల విడుదల ఎప్పుడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook