India Corona Update: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. తాజాగా దేశవ్యాప్తంగా 2,876 మందికి పాజిటివ్​గా తేలినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. కేసులు కాస్త పెరిగినప్పటికీ.. రికవరీలు కూడా భారీగా నమోదవడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 3,884 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కొవిడ్ పరిస్థితులు ఇలా..


దేశవ్యాప్తంగా ప్రస్తుతం 32,811 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. యాక్టివ్​ కేసుల శాతం 0.08 శాతంగా ఉండటం గమనార్హం. ఇక రోజువారీ పాజిటివిటి రేటు 0.38 శాతానికి దిగొచ్చింది.


దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,24,50,055 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది.


దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,16,072 మంది మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. 


దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,80,60,93,107 డోసుల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం డేటాలో వెల్లడైంది. ఇందులో గడిచిన 24 గంటల్లోనే 7,52,818 డోసులు పంపిణీ చేయడం గమనార్హం. నేటి నుంచి 12-14 ఏళ్ల వయస్సు వారికి టీకా కార్యక్రమం ప్రారంభించింది ప్రభుత్వం.


కరోనా కారణంగా గత 24 గంటల్లో 98 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కొవిడ్ మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.


ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ఇలా..


ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.  ఇప్పటి వరకు మొత్తం 462,034,300 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మరణాల సంఖ్య 6,073,766కు పెరిగింది. కొవిడ్ నుంచి 395,136,113 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 60,824,421 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.


Also read: Sonia Gandhi: ఐదురాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేయాలని సోనియా ఆదేశం!


Also read: Mobile Phones Usage In Office: ఆఫీసులో ఉద్యోగులు ఫోన్లు వాడొద్దు.. హైకోర్టు సంచలన తీర్పు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook