Children Vaccination: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో మరో ముందడుగు పడింది. 12-14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతినివ్వగా.. రేపటి నుంచి (మార్చి 16) టీకా ప్రక్రియ ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రేపటి నుంచి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు వైద్య సిబ్బంది.
ప్రస్తుతం ఆ ఒక్క టీకానే..
ప్రస్తుతం 12-14 ఏళ్ల వారికి ఒకే ఒక్క వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అదే హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న బయోలాజికల్ ఈ లిమిటెడ్ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్. ప్రస్తుతానికి దీనిని మాత్రమే చిన్నారులకు ఇచ్చేందుకు అనుమతి ఉంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా
- సాధారణంగా అందరికీ రిజిస్ట్రేషన్ చేసినట్లుగానే.. పిల్లకు కూడా కొవిన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి.
- ముందుగా కొవిడ్ యాప్ లేదా పోర్టల్‌లోకి వెళ్లి ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. పిల్లలు కాబట్టి.. తల్లిదండ్రులు లేదా సంరక్షకుడి నంబర్‌ను వినియోగించుకోవచ్చు.
- ఒకే నంబర్‌పై నలుగురికి రిజిస్ట్రేషన్ చేసే వీలుంది. కాబట్టి ఇప్పటికే ఒకే నంబర్‌పై భార్యా, భర్తలు టీకా రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. అదే నంబర్‌ను మరో ఇద్దరికి వినియోగించే వీలుంది.
- ముందుగా మొబైల్ నంబర్ ఇవ్వడం ద్వారా ఓటీపీ వస్తుంది. ఓటీపీ ధృవీకరిస్తే.. రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
- పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ వంటి వివరాలను ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయొచ్చు.
- ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తెలియని వారు నేరుగా.. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అనుకూలమైన సమయంలో స్లాట్ బుక్ చేసుకుని టీకా తీసుకునే వీలుంది.
Also read: PLI scheme: పీఎల్‌ఐ పథకానికి అనూహ్య స్పందన.. ప్రభుత్వ అంచనాలను మించిన దరఖాస్తులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook