దేశంలో కరోనా వైరస్ (India COVID19 Cases) తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 24,879 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించారు. ఒక్కరోజు నమోదైన కోవిడ్19 కేసులలో ఇదే అత్యధికం. జులై 9 ఉదయం నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 7,67,296కి చేరింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దుబే అరెస్ట్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే సమయంలో దేశంలో 487 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో దేశంలో కోవిడ్19 (COVID19) మరణాల సంఖ్య 21,129కి చేరింది. అయితే రికవరీ కేసుల రేటు 62శాతంగా ఉంది. మొత్తం కేసులకుగానూ చికిత్స అనంతరం 4,76,378 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2,69,789 యాక్టీవ్ కేసులున్నాయి.  RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్ 


మూడు రాష్ట్రాల్లో భారీగా కేసులు
మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కోవిడ్19 కేసుల తీవ్రత అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 6,603 కేసులు, తమిళనాడులో 3,756 కేసులు, ఢిల్లీలో 2033 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మొత్తం కేసులు 2,23,724, ఇందులో 9448 మంది చనిపోయారు. తమిళనాడులో మొత్తం కేసులు 1,22,350 కాగా, 1700 మందిని కోవిడ్ బలి తీసుకుంది. ఢిల్లీలో మొత్తం కేసులు 1,04,864కు చేరుకోగా ఇందులో 3,213 మంది మరణించారు. తాజాగా కేసులు తగ్గుతున్నాయి, రికవరీ కేసుల రేటు దాదాపు 70శాతంగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos