India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే.. కొన్నిరోజులుగా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు కరోనా రికవరీ కూడా కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లో బుధవారం ( డిసెంబరు 9న ) దేశవ్యాప్తంగా కొత్తగా.. 31,522 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 412 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ( Health Ministry ) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also Read: Andhra Pradesh: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం: ముగ్గురు మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా ( Covid-19 ) కేసుల సంఖ్య 97,67,372 పెరగగా.. మరణాల సంఖ్య 1,41,772 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,72,293 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 92,53,306 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రరేటు 94.74 శాతం ఉండగా.. మరణాల రేటు 1.45 శాతం ఉంది. Also read: Balram Bhargava: కోవిడ్ వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు ధ‌రించాల్సిందే


ఇదిలాఉంటే.. బుధవారం దేశవ్యాప్తంగా 9,22,959 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో డిసెంబరు 9వ తేదీ వరకు 15,07,59,726 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. Also read: COVID-19 vaccine: ఆ వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి బ్రేక్


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి