Coronavirus updates in India: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ (Covid-19) కేసుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. నిత్యం 30వేలకు చేరువలో నమోదవుతున్న కేసులు కాస్తా.. మంగళవారం 26వేలకు పైగా నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో మంగవారం ( డిసెంబరు 15న ) దేశ వ్యాప్తంగా కొత్తగా 26,382 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 387 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా ( Coronavirus ) కేసుల సంఖ్య 99,32,548 కి చేరగా.. మరణాల సంఖ్య 1,44,096 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Puvvada Ajay Kumar: తెలంగాణలో మరో మంత్రికి కరోనా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళవారం కరోనా నుంచి 33,813 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 94,56,449 కి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 3,32,002 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నాయి. Also read; Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం


ఇదిలాఉంటే.. మంగళవారం దేశవ్యాప్తంగా 10,85,625 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి డిసెంబరు 15వ తేదీ వరకు దేశంలో మొత్తం 15,66,46,280 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఐసీఎంఆర్ వెల్లడించింది.


Also read: Parliament: శీతాకాల సమావేశాలు రద్దు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook