India: 65 వేలు దాటిన కరోనా మరణాలు
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి వ్యాప్తి పెరుగుతూనే ఉంది. నిత్యం దేశవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.
India Covid-19 updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి వ్యాప్తి పెరుగుతూనే ఉంది. నిత్యం దేశవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో సోమవారం ( ఆగస్టు 31న ) కొత్తగా 69,921 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 819 మంది మరణించినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ( Health Ministry ) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాలతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,91,167కి చేరగా... మరణాల సంఖ్య 65,288కి పెరిగింది. Also read: Parliament Monsoon Session: 14 నుంచే పార్లమెంట్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,85,996 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటివరకు ఈ వైరస్ నుంచి 28,39,883 మంది కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. సోమవారం దేశవ్యాప్తంగా 10,16,920 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో ఆగస్టు 31 వరకు మొత్తం 4,33,24,834 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. Also read: Pranab Mukherjee: కోవిడ్ నిబంధనలతో జరగనున్న మాజీ రాష్ట్రపతి అంత్యక్రియలు