Parliament Monsoon Session: 14 నుంచే పార్లమెంట్

దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.

Last Updated : Sep 1, 2020, 09:35 AM IST
Parliament Monsoon Session: 14 నుంచే పార్లమెంట్

Parliament  Session Notification issued: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus ) వ్యాప్తి పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో పార్లమెంట్ ( Parliament ) వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ప్లార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈనెల  14 నుంచి అక్టోబరు 1వ తేదీ  వరకు జరగనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) ఆదేశాలతో సోమవారం లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌లు సోమవారం వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేశాయి. అయితే.. ఎలాంటి సెలవులు లేకుండా వరుసగా 18 రోజులు సమావేశాలను మొదటిసారి నిర్వహించనున్నారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మొదటిసారి జరుగుతున్న ఈ సమావేశాలకు అధికారులు ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. Also read: Pranab Mukherjee: కోవిడ్ నిబంధనలతో జరగనున్న మాజీ రాష్ట్రపతి అంత్యక్రియలు

పార్లమెంట్ భవనంలో సభ్యులు భౌతికదూరం పాటించేలా సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంటు భవనం గ్యాలరీలల్లో కూడా సభ్యులకు సీట్లను వేయనున్నారు. ఉభయ సభల్లో భారీ టీవీ తెరలతోపాటు మధ్యమధ్యలో శానిటైజేషన్‌ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలాఉంటే.. సమావేశాలకు మూడు రోజుల ముందే సభ్యులంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని నెగెటివ్‌ వచ్చినవారే సభకు రావాలని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ఇటీవల ఆదేశించిన విషయం మనందరికీ తెలిసిందే. Also read: Pranab Mukherjee in criticism: కాంగ్రెస్‌కి కోపం తెప్పించిన ప్రణబ్ ముఖర్జీ

Trending News