India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేల నుంచి లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా రోజూ 1100లకు పైగానే సంభవిస్తున్నాయి. అయితే గత 24గంటల్లో శనివారం ( సెప్టెంబరు 26న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 88,600 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా నిన్న 1,124 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Ministry of Health ) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,92,533 కి చేరగా..  మరణాల సంఖ్య 94,503 కి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,56,402 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 49,41,628 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ (Health Ministry ) వెల్లడించింది. Also read: Bollywood Drugs case: దీపిక, సారా, శ్రద్ధా, రకుల్ ఫోన్లు సీజ్


ఇదిలాఉంటే.. శనివారం దేశవ్యాప్తంగా 9,87,861 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 26 వరకు మొత్తం 7,12,57,836 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో దేశంలో కరోనా రికవరి రేటు 82.46 శాతం ఉండగా.. మరణాల రేటు 1.58 శాతం ఉంది. Also read: Jaswant Singh Dies: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత