India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 60లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 95వేలు దాటింది. గత 24గంటల్లో ఆదివారం ( సెప్టెంబరు 27న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 82,170 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ మహమ్మారి కారణంగా 1,039 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 60,74,703 కి చేరగా..  మరణాల సంఖ్య 95,542 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: SP Balasubrahmanyam News: వదంతులు సృష్టించి బాధపెట్టొద్దు: ఎస్పీ చరణ్


ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 50,16,521 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 9,62,640 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదిలాఉంటే.. ఆదివారం దేశవ్యాప్తంగా 7,09,394 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 27 వరకు మొత్తం 7,19,67,230 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 82.58 శాతం ఉండగా.. మరణాల రేటు 1.57 శాతం ఉంది. Also read: INDIGO: ఇండిగో విమానాన్ని ఢికొన్న పక్షి