India Covid-19: 62 లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 62లక్షలు దాటగా.. మరణాలు 97వేలు దాటాయి.
India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 62లక్షలు దాటగా.. మరణాలు 97వేలు దాటాయి. గత 24గంటల్లో మంగళవారం ( సెప్టెంబరు 29న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 80,472 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ మహమ్మారి కారణంగా 1,179 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 62,25,764 కి చేరగా.. మరణాల సంఖ్య 97,497 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Hathras Gang Rape: మృగాళ్ల వేటకు యువతి బలి.. బలవంతంగా మృతదేహం దహనం
ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 51,87,826 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 9,40,441 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదిలాఉంటే.. మంగళవారం దేశవ్యాప్తంగా 10,86,688 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 29 వరకు మొత్తం 7,41,96,729 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇదిలాఉంటే.. దేశంలో కరోనా రికవరీ రేటు 83.33 శాతం ఉండగా.. మరణాల రేటు 1.57 శాతంగా ఉంది.Also read: Babri Masjid demolition case: నేడే బాబ్రీ తీర్పు