India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది.  గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు, 1100లకు పైగా మరణాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 63 లక్షలు దాటాయి. అయితే.. గత 24గంటల్లో బుధవారం ( సెప్టెంబరు 30న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 86,821 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ మహమ్మారి కారణంగా 1,181 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,12,585 కి పెరగగా.. మరణాల సంఖ్య 98,678 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Balrampur Gang Rape: యూపీలో మరో హత్రాస్.. మృగాళ్ల వేటకు మరో యువతి బలి


ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 52,73,202 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 9,40,705 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదిలాఉంటే.. బుధవారం దేశవ్యాప్తంగా 14,23,052 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 30 వరకు మొత్తం 7,56,19,781 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇదిలాఉంటే.. దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 83.53 శాతం ఉండగా..  మ‌ర‌ణాల రేటు 1.56 శాతంగా ఉంది. Also read: Hathras Gang Rape: మృగాళ్ల వేటకు యువతి బలి.. బలవంతంగా మృతదేహం దహనం