India: 10 లక్షల కరోనా కేసులు, 25వేల మరణాలు
భారత్‌లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓవైపు రికవరీ రేటు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ.. కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. కరోనా కేసుల (India Corona cases cross the 10 lakh mark)లో మూడో స్థానంలో ఉన్న భారత్, మరణాల్లోనూ టాప్ 8 దేశాలలో ఉండటం గమనార్హం.
కరోనా వైరస్ విషయంలో భారత్ అవాంఛిత మైలురాళ్లను అధిగమిస్తోంది. ఓవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మిలియన్ మార్క్ (10 లక్షల కరోనా కేసులు) దాటగా.. మరోవైపు కోవిడ్19 మరణాల సంఖ్య 25వేలకు చేరింది. గడిచిన 24 గంటల్లో (గురువారం) దేశ వ్యాప్తంగా 34,956 మందికి కొత్తగా వైరస్ నిర్ధారించారు. అదే సమయంలో 687 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఒక్కరోజులో నమోదైన కరోనా కేసులలో ఇదే అత్యధికం. ప్రియుడితో లేడీ కానిస్టేబుల్ క్వారంటైన్.. ఊహించని ట్విస్ట్
తాజా కేసులతో కలిపితే భారత్‌లో మొత్తం కరోనా కేసుల (India CoronaVirus cases) సంఖ్య 10,03,832కు చేరింది. కరోనా మరణాలు 25,602కు చేరాయి. మొత్తం కేసులకుగానూ చికిత్స అనంతరం కోలుకుని 6,35,757 మంది డిశ్ఛార్జ్ కాగా, ప్రస్తుతం 3,42,473 యాక్టివ్ కరోనా కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య, కుంటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
జూన్ నెలలో 50శాతంగా ఉన్న రికవరీ రేటు జులైనాటికి 63శాతానికి పెరగడం ఊరట కలిగించే విషయం. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10లక్షల జనాభాకు సుమారుగా 1630 కోవిడ్19 కేసులు నమోదవుతుండగా.. భారత్‌లో ఈ సంఖ్య 658గా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..