Budget 2022: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఇండియాదే. కోవిడ్ మహమ్మారిని తట్టుకుని మరీ అటు వ్యవసాయ రంగంతో పాటు ఇతర రంగాలు కూడా ఎదుగుతున్న పరిస్థితి. మరో రెండేళ్లలోనే ఇండియాకు ఆ హోదా దక్కనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అయినా సరే ఆ మహమ్మారిని దాటుకుని మరీ దేశ ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటున్న పరిస్థితి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 9.2 శాతం జీడీపీ సాధించే దిశగా కన్పిస్తోంది. తాజాగా వెలువడిన ఆర్ధిక సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.


ముఖ్యంగా 2022-23 ఆర్ధిక సంవత్సంలో వృద్ది రేటు 8-8.5 మధ్య ఉండవచ్చని ఆర్ధిక సర్వే వెల్లడించింది. దేశ ఆర్ధిక వ్యవస్థకు ఆసరా అందించే అవకాశం కూడా ఉందని సర్వే తేల్చింది. స్థూల ఆర్ధిక స్థిరత్వానికి సంబంధించిన సూచీలు, వివరాల్ని పరిశీలిస్తే..ఇండియా సమీప భవిష్యత్తులో సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ఘంగా ఉందని వివరించింది. దేశంలో పెరుగుతున్న వ్యాక్సినేషన్, సంస్కరణలు, నియంత్రణల్లో సడలింపులు  రానున్న 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సపోర్ట్ కానున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే చైనాను దాటుకుని అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా ఇండియా నిలవనుంది. మరో రెండేళ్ల పాటు ఈ హోదాను నిలబెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు ఆర్ధిక విశ్లేషకులు. 


దేశ ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన వార్షిక  నివేదికగా ఈ సర్వే ఉంటుంది. కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ఈ నివేదికను పార్లమెంట్‌లో సమర్పించారు. కరోనా మహమ్మారి ప్రారంభానికి ముందుతో పోలిస్తే..జీడీపీ 1.3 శాతం ఎక్కువగా ఉందని నివేదికలో పొందుపరిచారు. ఇక చమురు ధరలు ప్రతి ట్యాంక్‌కు 70-75 డాలర్ల ఉండవచ్చని అంచనా ఉంది. 2022-23 ఆర్ధిక సంవత్సరపు వృద్ధిరేటు అంచనాలు ప్రపంచబ్యాంకు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి మాత్రం 9శాతంగా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పన్నుల రాబడి పెరిగింది. మరోవైపు కోవిడ్ ఉధృతి కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ ( India Economy) రెండుగా చీలిందని సర్వే స్పష్టం చేసింది. ఎంఎస్ఎంఈ, వాణిజ్యం, రవాణా, పర్యాటకం, రిటైల్ వ్యాపారం, హోటల్, వినోదం వంటివి ప్రతికూల ప్రబావాన్ని ఎదుర్కొన్నాయి. ఇక వైద్య, సేవారంగాలు వృద్ది సాధించాయి. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ మత్స్య విభాగం వంటివాటితో ఆ కుటుంబాలకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. 


కోవిడ్ (Covid Pandemic) కారణంగా లాక్‌డౌన్, వివిధ ఆంక్షలతో 2020 ఏప్రిల్ -జూన్ మధ్యకాలంలో ఉపాది సూచికలు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడవి తిరిగి కోలుకుంటున్నాయి. పట్టణాల్లో ఉపాది మెరుగుపడిన పరిస్థితి ఉంది. అటు అంతరిక్షంలో కూడా ప్రైవేటు రంగం, విద్యాసంస్థల జోరు పెరిగింది. ప్రతియేటా బడ్జెట్ కంటే ముందు ఈ నివేదిక అత్యంత కీలకంగా పరిగణిస్తారు. 


Also read: Union Budget Key Points: కేంద్ర బడ్జెట్ అంటే ఏమిటి, బడ్జెట్‌లో కీలకమైన పది అంశాలేంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook