ఆర్మీడే సందర్భంగా పాక్కు భారత్ దీటైన జవాబు..!
ఆర్మీడే సందర్భంగా పాక్కు భారత్ దీటైన జవాబు..!
జనవరి 15.. ఈ రోజు ఆర్మీడేగా భారతీయ సేనలు జరుపుకుంటాయి. అయితే ఇదే రోజున ఇండియన్ ఆర్మీ, తన ప్రత్యర్థి పాకిస్తాన్‌కు దీటైన జవాబు ఇచ్చింది. భారత్ సరిహద్దు దేశాలతో జాగ్రత్తగా ఉండాలని.. అందుకు అనువైన పథకాలకు శ్రీకారం చుట్టాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చెప్పిన రెండు రోజుల్లోనే తన సత్తా ఏమిటో చూపించింది. పూంజ్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ సైనికులపై ఆక్రమిత కాశ్మీరులో కాపుగాస్తున్న పాక్ సైనికులు కాల్పులు జరపడంతో.. భారత సైన్యం కూడా వెంటనే స్పందించి తిరుగుదాడి చేసింది.
చాలాసేపు ఇరు దేశాల సరిహద్దుల వద్ద పరస్పరం కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఏడుగురు పాకిస్తాన్ సైనికులను తాము హతమార్చినట్లు ఇండియన్ ఆర్మీ అధికారికంగా తెలిపింది. అయితే ఈ విషయంలో కూడా పాక్ అబద్ధాలకోరుగానే ప్రవర్తించింది. పాక్ సైనికులు నలుగురు మాత్రమే మరణించినట్లు తెలిపింది. మిగతా ముగ్గురు ఇండియన్ ఆర్మీ సైనికులే అని తెలిపింది.