ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు తయారుచేసే దేశాల్లో భారతదేశం రెండవ స్థానంలో ఉందని .. మొదటి స్థానంలో ఇంకా చైనా కొనసాగుతుందని ఇండియన్ సెల్యూలర్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఐసీఏ జాతీయ అధ్యక్షులు పంకజ్ మొహింద్రా ఈ మేరకు కేంద్రమంత్రులు అందరికీ రాసిన ఉత్తరంలో ఈ విషయాన్ని కూడా పంచుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్కెట్ రిసెర్చి కంపెనీ ఐహెచ్‌ఎస్‌తో పాటు వియత్నాంలోని జనరల్ స్టాటిస్టిక్స్ ఆఫీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించాయని ఆయన తెలిపారు. గతంలో వియత్నాం మొబైల్ ఫోన్ల తయారీలో రెండవ స్థానంలో ఉండగా.. ఈ సారి ఆ స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది.


ఇటీవలే కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థగా పనిచేసే ఫాస్ట్ ట్రాక్ టాస్క్ ఫోర్సు ఓ ప్రకటన చేస్తూ 2019 సంవత్సరానికల్లా 500 మిలియన్ల మొబైల్ ఫోన్లు తయారుచేసే దేశంగా భారత్‌ను చూడాలన్నదే లక్ష్యమని తెలిపింది. అలాగే వచ్చే సంవత్సరం నాటికి 120 మిలియన్ల మొబైల్‌ ఫోన్ల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సంస్థ తెలిపింది.