Corona Updates: 70 వేలకు చేరువలో కరోనా యాక్టివ్ కేసులు
Corona Updates: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 10,112 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Covid-19 Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అయితే క్రితం రోజుతో పోలిస్తే కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,112 కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 67,806కి చేరింది. వైరస్ తో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క కేరళలోనే ఏడుగురు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 5,31,329గా రికార్డయింది.
కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్రల నుంచే వస్తున్నాయి. తాజాగా 9,833 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మెుత్తంగా 4,42,92,854 మంది రికవరీ అయ్యారు. గత 24 గంటల్లో 1,43,899 మందికి కరోనా నిర్ధారణ టెస్టులు చేశారు. ప్రస్తుతం కోవిడ్ కేసుల పెరుగుదలకు XBB.1.16 కోవిడ్-19 వేరియంట్ కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Amritpal Singh: 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్
గత కొన్ని రోజులగా కరోనా కేసులు పది వేలకుపైగానే నమోదవుతున్నాయి. నిన్న 12,193 కరోనా కేసులు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న కరోనా వేరియంట్ ప్రమాదమైనది కాదనీ.. కొంతవరకే ప్రభావం చూపగలదని పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావల్లా తెలిపారు.
Also Read: Coronavirus Latest: ఒక్క రోజులోనే 12 వేలకు పైగా కొత్త కేసులు.. ఎంత మంది చనిపోయారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook