న్యూఢిల్లీ: మతం ప్రతిపాదికన 1947లో దేశం ఎలాగైతే భారత్-పాకిస్థాన్‌గా విడిపోయిందో.. అలాగే 2047లో మరోసారి భారతదేశం విడిపోతుందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ అన్నారు. ఈ 72 ఏళ్లలో జనాభా 33 కోట్ల నుంచి 135.7 కోట్లకు పెరిగిందని ఆయన చెప్పారు. జనాభా పెరుగుదల ప్రమాదకరం అని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. 'ప్రస్తుతం, ఆర్టికల్ 35-ఎపై చర్చ జరుగుతోంది. రానున్న కాలంలో, ఇక భారతదేశం గురించి మాట్లాడటం అసాధ్యం అవుతుంది' అని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే, జీ హిందూస్థాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెరుగుతున్న జనాభాపై  గిరిరాజ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ అంశంపై చర్చకు పిలుపునిచ్చారు.'భారతదేశంలో జనాభా పెరుగుదల  ఓ పెద్ద సమస్య. దేశంలో జనాభా నియంత్రణపై గ్రామ సభల నుండి పార్లమెంట్ వరకు చర్చ జరగాలి. మైనారిటీల నిర్వచనంపై కూడా చర్చ జరగాలి. జనాభా నియంత్రణపై పటిష్టమైన చట్టం చేయకపోతే, దేశం నష్టపోతుంది. మన గళాన్ని వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.' అని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.