India Defence Exports: ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి రక్షణ రంగ ఎగుమతులు
Rajnath Singh: దేశ రక్షణ రంగ ఎగుమతులు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రూ.15,920 కోట్ల విలువైన డిఫెన్స్ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
India Defence Exports: 2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు రూ. 15,920 కోట్ల ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీ కూడా హర్షం వ్యక్తం చేశారు.
''2021-22లో దేశ రక్షణ ఎగుమతులు రూ. 12,814 కోట్లు కాగా.. 2022-2023లో దేశ రక్షణ ఎగుమతులు రూ. 15,920 కోట్ల ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇది దేశానికి గొప్ప విజయం" అని రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా "ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో మన రక్షణ ఎగుమతులు మరింత పెరుగుతూనే ఉంటాయి" అని ఆయన అన్నారు.
రాజ్‌నాథ్ సింగ్ తెలపిన వివరాల ప్రకారం, ఇండియా 2020-21లో రూ. 8,434 కోట్లు, 2019-20లో రూ. 9,115 కోట్లు మరియు 2018-19లో రూ. 10,745 కోట్ల విలువైన సైనిక హార్డ్‌వేర్‌ను ఎగుమతి చేసింది. 2017-18లో మొత్తం రూ. 4,682 కోట్లు మరియు 2016-17లో రూ 1,521 కోట్లు ఢిఫెన్స్ ఎక్స్ పోర్ట్స్ చేసింది.
రూ. 1,75,000 కోట్ల విలువైన రక్షణ హార్డ్‌వేర్‌ను తయారు చేయడంతోపాటు 2024-25 నాటికి రక్షణ ఎగుమతులను రూ 35,000 కోట్లకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా స్వదేశీ రక్షణ రంగ ఉత్పత్తులను పోత్సాహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook