Kejriwal vs Gujarat High Court: ఆ డిగ్రీ నకిలీది కావచ్చు, గుజరాత్ తీర్పుపై అరవింద్ కేజ్రీవాల్ అసంతృప్తి

Kejriwal vs Gujarat High Court: ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుజరాత్ హైకోర్టు తీర్పుతో ప్రధాని మోదీ విద్యార్హతపై అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయన్నారు అరవింద్ కేజ్రీవాల్.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 1, 2023, 03:53 PM IST
Kejriwal vs Gujarat High Court: ఆ డిగ్రీ నకిలీది కావచ్చు, గుజరాత్ తీర్పుపై అరవింద్ కేజ్రీవాల్ అసంతృప్తి

Kejriwal vs Gujarat High Court: ప్రధాని మోదీ డిగ్రీ విద్యార్హత వ్యవహారంపై అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు గుజరాత్ హైకోర్టు ఆదేశాలిచ్చినా వెనుకడుగు వేయలేదు. గుజరాత్ హైకోర్టు ఆదేశాలు ప్రధాని మోదీ విద్యార్హతపై అనుమానాల్ని మరింతగా పెంచుతున్నాయని చెబుతూ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సమాచారాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క చెప్పాలంటూ కేంద్ర, సమాచార కమీషన్ ఇచ్చిన ఆదేశాలు గుజరాత్ హైకోర్టు కొట్టిపారేసింది. ప్రధాని డిగ్రీ సర్టిఫికేట్లు చూపించాల్సిన అవసరం లేదని పేర్కొనడమే కాకుండా..25 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 4 వారాల్లోగా గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎక్కౌంట్‌లో డిపాజిట్ చేయాలన్ని కోరారు. ఈ తీర్పుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

దేశ ప్రధాని ఏం చదువుకున్నారో దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రధాని డిగ్రీ చూడాలని డిమాండ్ చేస్తే 25 వేల జరిమానా విధించడం సమంజసమేనా అని నిలదీస్తున్నారు. దేశంలో అసలేం జరుగుతోందని..నిరక్షరాస్యుడు, తక్కువ విద్యార్హత ఉన్న ప్రధానితో దేశానికి ప్రమాదకరమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. గుజరాత్ హైకోర్టు తీర్పు అలా ఇచ్చిందంటే..బహుశా ఆయన డిగ్రీలు నకిలీవి కావచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో పలు సందర్భాల్లో ప్రధాని మోదీ చేసిన వేర్వేరు వ్యాఖ్యల్ని ట్వీట్ చేస్తూ మోదీని ఎద్దేవా చేశారు. 

మురుగు కాల్వల నుంచి వచ్చే గ్యాస్ సహాయంంతో టీ తయారు చేసుకోవచ్చని చెప్పి ఓసారి సంచనలం రేపారు. వర్షాలు వచ్చేటప్పుడు విమానాన్ని రాడార్ గుర్తించలేదని చెప్పి మరోసారి షాక్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలైతే ఆర్మీ సిబ్బంది, విద్యార్ధులు, శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు కేజ్రీవాల్. గ్లోబల్ వార్మింగ్ అంటూ ఏమమమీ ఉండదన్నారు. ఇంకో సందర్భంలో కెనడాలో a+b x () square అంటూ ఏదేదో చెప్పేందుకు ప్రయత్నించి అభాసుపాలయ్యారని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. 

అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి చదువుకున్న వ్యక్తి ప్రధాని కావాలని అరవింద్ కేజ్రీవాల్ కోరుకున్నారు. ప్రధాని వ్యక్తికి చదువు లేకపోతే చుట్టూ ఉన్న అధికారులు ప్రభావితం చేస్తాని చెప్పారు. 

Also read: Covid19 Cases in India: కలవరం కల్గిస్తున్న కోవిడ్19, గత 24 గంటల్లో 3 వేల కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News