India Post Office Recruitment 2023: పోస్టల్ శాఖలో 40 వేల ఉద్యోగాలు.. టెన్త్ అర్హత.. డైరెక్ట్ జాబ్
Indian Post Recruitment Online Apply: పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఒకేసారి 40 వేల పోస్టులను భర్తీ చేయనునున్నారు. ఈ పోస్టులకు అర్హత ఏంటి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? ఎప్పుడు చివరి తేదీ..? పూర్తి వివరాలు ఇవిగో..
Indian Post Recruitment Online Apply: నిరుద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్. పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ డ్రైవ్ కింద మొత్తం 40 వేలకు పైగా పోస్టులు భర్తీ చేయనున్నారు. 10వ తరగతి అర్హత ఈ రిక్రూట్‌మెంట్ కోసం అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 16 ఫిబ్రవరి 2023. అత్యధికంగా యూపీలో 7987 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 1266, ఆంధ్రప్రదేశ్‌లో 2480 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.inని సందర్శించాలి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం రాత పరీక్ష లేదు. మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంటే 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, డాక్ సేవక్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతిలో గణితం, స్థానిక భాష, ఆంగ్లంలో ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారైతే తెలుగు సబ్జెక్టుతో టెన్త్ పాస్ అయి ఉండాలి.
ఖాళీల వివరాలు..
బీహార్ - 1461
ఒడిషా-1382
పంజాబ్-766
రాజస్థాన్-1684
తమిళనాడు-3167
తెలంగాణ-1266
యూపీ-7987
ఉత్తరాఖండ్-889
బెంగాల్-2127
ఆంధ్రప్రదేశ్-2480
అస్సాం-407
ఛత్తీస్‌గఢ్-1593
ఢిల్లీ-46
గుజరాత్-2017
హర్యానా-354
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రోజుకు కేవలం 4 గంటల పని చేయాల్సి ఉంటుంది. జీతంతో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు అదనంగా ఇన్సెంటివ్ కూడా వస్తాయి. బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఈ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వంటివి తపాలా శాఖ అందిస్తోంది.
Also Read: David Warner: పఠాన్ లుక్‌లో అదగొట్టిన డేవిడ్ వార్నర్.. ఆస్కార్ గ్యారంటీ
Also Read: Ind Vs NZ: కివీస్‌తో రెండో టీ20.. ఎవరూ ఊహించని రెండు మార్పులు.. పృథ్వీ షా ఎంట్రీ కన్ఫార్మ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి