David Warner: పఠాన్ లుక్‌లో అదగొట్టిన డేవిడ్ వార్నర్.. ఆస్కార్ గ్యారంటీ

David Warner Pathan Look: సోషల్ మీడియాలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రచ్చ మాములుగా లేదు. సినిమా డైలాగ్స్‌, పాటలకు స్ఫూఫ్‌లు చేసి వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు అలరిస్తున్నాడు. తాజాగా పఠాన్ మూవీలో షారూఖ్ ఖాన్ లుక్‌లో అదరగొట్టేశాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2023, 11:17 PM IST
David Warner: పఠాన్ లుక్‌లో అదగొట్టిన డేవిడ్ వార్నర్.. ఆస్కార్ గ్యారంటీ

David Warner Pathan Look: వచ్చే నెల నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. కంగారూ జట్టు ఫిబ్రవరి 1న భారత్‌కు చేరుకోనుంది. ఆస్ట్రేలియా జట్టు కొన్ని రోజుల పాటు బెంగళూరులో ఉంటుంది. శిక్షణ శిబిరంలో అక్కడే ప్రాక్టీస్ చేస్తారు. ఆ తర్వాత మొదటి టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఆసీస్ జట్టు నాగ్‌పూర్‌కు బయల్దేరుతుంది. పాట్ కమిన్స్ సారథ్యంలోని జట్టు ఈ పర్యటనలో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ టెస్టు సిరీస్‌కు ముందు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. పఠాన్ మూవీ లుక్‌లో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వార్నర్ భాయ్ యాక్టివ్‌​గా ఉంటాడు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినా వార్నర్‌కు ఇండియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. తన ఆటతోనే కాకుండా.. సోషల్ మీడియా ద్వారా కుడా వార్నర్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కరోనా లాక్‌​డౌన్ సమయంలో వార్నర్​ తెలుగు పాటలకు స్టెప్పులేసి మెప్పించాడు. మాస్​ డైలాగులు కూడా పేల్చాడు. బుట్ట బొమ్మ పాటకు వార్నర్ వేసిన స్టెప్పులు ఇప్పటికీ ఇంటర్నెట్​లో హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. తెలుగుతో పాటు ఇతర భాష పాటలు, ఫ్యాన్స్​ ఎడిట్​ చేసిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంటాడు. క్రీజ్‌లో ఎంత దూకుడుగా ఉంటాడో.. సోషల్ మీడియాలో కూడా అంతే స్పీడ్‌గా ఉంటాడు ఈ ఆసీస్ ఓపెనర్. 

తాజాగా పటాన్ మూవీలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాక్‌లో కనిపించిన వీడియో అభిమానులకు తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో డేవిడ్ వార్నర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేశాడు. షారుఖ్ ఖాన్ ఫేస్ ప్లేస్‌లో తన చిత్రం పెట్టాడు. 'వావ్ వాట్ ఏ ఫిల్మ్.. ఈ సినిమాకు పేరు పెట్టగలవా..? #legend #icon' అని వార్నర్ క్యాప్షన్ ఇచ్చాడు. అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తూ.. షేర్ చేస్తున్నారు. డేవిడ్ వార్నర్‌కు ఆస్కార్ గ్యారంటీ అంటూ పోస్టులు పెడుతున్నారు.

 

ఫిబ్రవరి 9 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నాగ్‌పూర్‌లో జరగనుంది. కాగా రెండో టెస్టు ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు ఢిల్లీలో జరగనుంది. మూడో టెస్టు మార్చి 1 నుంచి 5 వరకు ధర్మశాలలో, నాలుగో టెస్టు మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. భారత్‌కు ఈ సిరీస్ కీలకం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకోవాలంటే.. కంగారూ జట్టును మెరుగైన మార్జిన్‌తో ఓడించాలి.

Also Read: Minister Roja: లోకేష్‌ అడుగుపెడితే ప్రాణాలు గాల్లోకే.. తారకరత్న త్వరగా కోలుకోవాలి: మంత్రి రోజా  

Also Read: Ind Vs NZ: కివీస్‌తో రెండో టీ20.. ఎవరూ ఊహించని రెండు మార్పులు.. పృథ్వీ షా ఎంట్రీ కన్ఫార్మ్..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News