Covid-19 updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ వేగంగా పెరుగుతూనే ఉంది. నిత్యం 60వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. వేయికి చేరువలో మరణాలు సంభవిస్తున్నాయి. గత 24 గంటల్లో ( ఆగస్టు 24న ) దేశవ్యాప్తంగా కొత్తగా 60,975 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 848 మంది మరణించినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ( Health Ministry ) మంగళవారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,67,324కు పెరగగా.. మరణాల సంఖ్య 58,390కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 24,04,585 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 7,04,348 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. Also read: Building Collapsed : ఇద్దరు మృతి.. చాలామంది శిథిలాల కిందనే..!


ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా సోమవారం  9,25,383 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. ఆగస్టు 24 వరకు 3,68,27,520 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.   Also read: TSCETS 2020: తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..