New Covid Variant Cases in India: దేశంలో కరోనా కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 798 కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,091గా ఉంది. గత 225 రోజుల్లో ఇదే అత్యధికం. మహమ్మారితో ఐదుగురు మృతి చెందారు. ఇందులో కేరళ నుంచి ఇద్దరు, మహారాష్ట్ర, పుదుచ్చేరి మరియు తమిళనాడు నుండి ఒక్కొక్కరు ఉన్నారు. దీంతో దేశంలో మెుత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 220.67 కోట్ల టీకాలు వేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు దేశంలో డిసెంబరు 28 వరకు కరోనా సబ్-వేరియంట్ JN.1 కేసులు 145 వెలుగు చూశాయి. ఈ మెుత్తం కేసులలో కేరళ నుండి 41, గుజరాత్ నుండి 36, కర్ణాటక నుండి 34, గోవా నుండి 14, మహారాష్ట్ర నుండి 9, రాజస్థాన్ నుండి 4, తమిళనాడు నుండి 4, తెలంగాణ నుండి 2, మరియు ఢిల్లీ నుండి ఒక కేసు ఉన్నాయి. 


నగరంలో జేఎన్. 1 వేరియంట్ తో బాధపడుతున్న 50 ఏళ్ల వ్యక్తి కోలుకున్నాడని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. దీంతో ఈ వేరియంట్ కు సంబంధించిన యాక్టివ్ కేసులు లేవని ఆయన అన్నారు. ఈ కొత్త వేరియంట్ కు సంబంధించిన కేసులు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సహా 9 రాష్ట్రాల్లో బయటపడ్డాయి. జేఎన్.1 వేరియంట్ మెుదటి కేసు కేరళలో నమోదైంది. జేఎన్. 1 అనేది ఒమిక్రాన్ సబ్ వేరియంట్. దీన్నే బీఏ 2.86 లేదా పిరోలా అని పిలుస్తున్నారు. వింటర్ సీజన్ కావడంతో కరోనా కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. 


Also Read: Bharat Rice: మార్కెట్‌లోకి భారత్ బ్రాండ్ బియ్యం.. కేజీ రూ.25కే..!


Also Read: Delhi Visibility: ఢిల్లీని దట్టంగా కమ్మేస్తున్న పొగమంచు, విమానాలు, రైళ్లు, వాహన రాకపోకలపై తీవ్ర ప్రభావం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter