Corona Death Bells: కరోనా సెకండ్ వేవ్ దేశంలో విలయతాండవం సృష్టిస్తోంది. కోవిడ్ రెండవ దశ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. కేసుల సంఖ్య పెరగడమే కాకుండా మరణ మృదంగం మోగిస్తోంది. ప్రజానీకం గజగజలాడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలో ఇప్పుడు ఇండియాలోనే అత్యధికంగా కరోనా సంక్రమణ (Corona spread) జరుగుతోంది. భారీగా కేసులు పెరుగుతున్నాయి. వారం పది రోజుల్నించి ప్రతిరోజూ కేసుల సంఖ్య 2 లక్షలు దాటి నమోదవుతోంది. సోమవారం నాడైతే కరోనా కేసుల సంఖ్య రికార్డు సాధించింది.ఏకంగా 2 లక్షల 73 వేల కేసులు నమోదై పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. గత 24 గంటల్లో కూడా అదే పరిస్థితి. ఏకంగా 2 లక్షల 59 వేల కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.కేవలం కేసుల సంఖ్య పెరగడమే కాకుండా దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య (Corona Deaths) కూడా పెరుగుతోంది. సోమవారం నాడు 1691 మంది కరోనా కారణంగా మరణిస్తే...గత 24 గంటల్లో ఆ సంఖ్య మరింతగా పెరిగింది. కరోనా సెకండ్ వేవ్‌లో ( Corona Second Wave) గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా 1761 మంది ప్రాణాలు కోల్పోయారు. 


దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1 కోటి 53 లక్షల 21 వేల 89కు చేరుకోగా..మరణాల సంఖ్య 1 లక్షా 80 వేల 550కు పెరిగింది. గత 24 గంటల్లో 1 లక్షా 54 వేల 761 మంది కోలుకున్నారు.ఇప్పటివరకూ దేశంలో 1 కోటి 31 లక్షల 8 వేల 582 మంది చికిత్సతో కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 20 లక్షల 31 వేల యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ్ 19 ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ఇప్పటికే రోగులకు బెడ్స్,వెంటిలేటర్లు,రెమ్‌‌డెసివిర్ ఇంజక్షన్లు ( Remdesivir Injections), ఆక్సిజన్ కొరత (Oxygen Shortage) స్పష్టంగా కన్పిస్తోంది. గత ఏడాది కోవిడ్ ప్రారంభమైన తరువాత దేశవ్యాప్తంగా  రోగుల సంఖ్య 1.25 కోట్లు కాగా..కేవలం పదిహేను రోజుల్లోనే ఆ సంఖ్య 1.50 కోట్లకు చేరుకుంది. దేశంలో ఇప్పటివరకూ 12 కోట్లు 71 లక్షల 29 వేల 113 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. 


Also read: Summer holidays 2021: పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ఢిల్లీ సర్కారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook