Corona Cases In India: దేశం​లో కొవిడ్​ కేసుల సంఖ్య (India covid cases) మరోసారి స్వల్పంగా పెరిగింది. తాజాగా 11,89,470 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,091 కొత్త కేసులు వెలుగుచూశాయి. నిన్నటి కంటే 14 శాతం మేర కేసులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 340 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కేసులు 3.44 కోట్లకు చేరగా.. 4.6 లక్షలకు పైగా మరణాలు నమోదయ్యాయని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు 1.4 లక్షల దిగువనే నమోదయ్యాయి. క్రియాశీల రేటు 0.40 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.25 శాతంగా కొనసాగుతోంది. నిన్న 13,878 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.38 కోట్లను దాటాయి. 


టీకాల పంపిణీ..


దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 57,54,817 డోసుల వ్యాక్సిన్​ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,10,23,34,225కి చేరింది.


ప్రపంచవ్యాప్తంగా..


ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా​ కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 5,36,256 మందికి కొవిడ్​​ (Corona update) సోకింది. కరోనా​ ధాటికి 7,874 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,21,03,318 కు చేరింది. మొత్తం మరణాలు 50,87,705కి చేరాయి. 


Also Read: Delhi Air Quality: ఢిల్లీలో కాలుష్య భూతం- మరోసారి ప్రమాదకరస్థాయికి గాలి నాణ్యత  


Also Read: Tamil Nadu rains: తమిళనాడును వీడని వర్షాలు- చెన్నైకి రెడ్ అలర్ట్​ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook