Covid 19 Cases Today: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2568 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 20 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,84,913కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,28,889కి చేరింది. గత 3 రోజులుగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తుండటం గమనార్హం. ఈ నెల 1న 3324 కేసులు నమోదవగా.. 2న 3157 కేసులు, ఇవాళ 2568 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 589 కేసులు తక్కువగా నమోదయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్తగా నమోదైన 20 మరణాల్లో 15 మరణాలు కేరళలోనే సంభవించడం గమనార్హం. పంజాబ్‌లో ముగ్గురు, మహారాష్ట్ర, మిజోరంలలో ఒకరు చొప్పున కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 19,137గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.04 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.74 శాతంగా ఉండగా డైలీ పాజిటివిటీ రేటు 0.61 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 0.71 శాతంగా ఉంది. కరోనా మరణాలు 1.22 శాతంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 189 కోట్ల పైచిలుకు వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.


ఆగస్టు 7, 2020లో దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షల మార్క్‌ను తాకింది. ఆ తర్వాత కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ గతేడాది జూన్ నాటి 3 కోట్లకు చేరింది. ఈ ఏడాది జనవరిలో కేసుల సంఖ్య 4 కోట్లకు చేరింది. ప్రస్తుతం ప్రికాషనరీ డోసు వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కరోనా రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయినవారికి ఈ డోసు ఇస్తున్నారు. 60 ఏళ్లకు పైబడినవారికి మాత్రమే ప్రభుత్వ టీకా కేంద్రాల్లో ప్రికాషనరీ డోసు ఇస్తున్నారు. మిగతవారు ప్రైవేట్ కేంద్రాల్లో ప్రికాషనరీ డోసు వేయించుకోవాల్సి ఉంటుంది. 


Also Read: IPL 2022 Umpiring: క్యాచ్ అయితే వైడ్ ఇచ్చాడు.. అతడికి ఉత్తమ అంపైరింగ్‌ అవార్డు ఇవ్వండి! 


Also Read: This Week Tollywood Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న కొత్త సినిమాలివే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook