IPL 2022 Umpiring: క్యాచ్ అయితే వైడ్ ఇచ్చాడు.. అతడికి ఉత్తమ అంపైరింగ్‌ అవార్డు ఇవ్వండి!

KKR vs RR, IPL 2022: Netizens lash out at umpires. క్యాచ్ ఔట్ అయినా వైడ్ ఇవ్వడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన ముంబై వేదికగా జరిగుతున్న ఐపీఎల్ 2022లో జరిగింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2022, 10:38 AM IST
  • ఏం అంపైరింగ్‌ సామీ
  • క్యాచ్ అయితే వైడ్ ఇచ్చాడు
  • అతడికి ఉత్తమ అంపైరింగ్‌ అవార్డు ఇవ్వండి
IPL 2022 Umpiring: క్యాచ్ అయితే వైడ్ ఇచ్చాడు.. అతడికి ఉత్తమ అంపైరింగ్‌ అవార్డు ఇవ్వండి!

Netizens trolls KKR vs RR field umpire for gives wide baal while Rinku Singh batting: మైదానంలో ఫీల్డ్ అంపైర్లు అప్పుడప్పుడు తప్పిదాలు  చేయడం సహజమే. ఎల్బీ, రనౌట్, వైడ్ విషయంలో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. కానీ క్యాచ్ ఔట్ అయినా వైడ్ ఇవ్వడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన ముంబై వేదికగా జరిగుతున్న ఐపీఎల్ 2022లో జరిగింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ ఈ భారీ తప్పిదానికి పాల్పడ్డాడు. 

లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్‌ రైడర్స్ చివరి రెండు ఓవర్లలో 18 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో లెఫ్ట్ హ్యాండర్స్ నితీష్ రాణా, రింకు సింగ్ ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు బంతిని అందించాడు. లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి ఆఫ్ సైడ్‌లో ఫీల్డ్ సెట్ చేసి వైడ్ యార్కర్ రూపంలో బంతిని సంధించాడు. బ్యాట్స్‌మెన్ దాదాపు ట్రామ్‌ లైన్‌ను కవర్ చేస్తూ క్రీజులో నుంచి చాలా దూరం వరకు వచ్చి షాట్ ఆడాడు. అయినా కూడా అంపైర్ నితిన్ పండిట్‌ ఆ బంతిని వైడ్ ఇచ్చాడు. దాంతో అందరూ షాక్ అయ్యారు.

అంతకుముందు ట్రెంట్ బౌల్ట్ వేసిన షార్ట్ బాల్‌ను కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన శ్రేయస్.. బ్యాట్ సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి అతడి గ్లోవ్‌‌ను తాకుతూ వెళ్లి కీపర్ సంజూ శాంసన్ చేతిలో పడింది. ఔట్ అంటూ సంజూ గట్టిగా అప్పీల్ చేసినా.. ఫీల్డ్ అంపైర్ వైడ్ ఇచ్చి పెద్ద షాక్ ఇచ్చాడు. వెంటనే రివ్యూ తీసుకొన్న సంజూ సక్సెస్ అయ్యాడు. 

ఇక రాజస్థాన్ బ్యాటింగ్ సందర్భంగా శివం మావి వేసిన ఆఖరి ఓవర్‌లో‌నూ వైడ్‌ను అంపైర్ ఇవ్వలేదు. నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న ఆర్ అశ్విన్ అంపైర్‌ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు. స్ట్రైకింగ్ చేస్తున్న శిమ్రాన్ హెట్‌మైర్ అయితే వైడ్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాడు. ఓకే మ్యాచులో ఇన్ని తప్పిదాలు జరగడంతో అభిమానులు అంపైర్లపై మండిపడుతున్నారు. 'అంపైర్ నిద్రపోయాడు', 'క్యాచ్ అయితే వైడ్ ఇచ్చాడు.. ఉత్తమ అంపైరింగ్‌ అవార్డు ఇవ్వండి', 'కోల్‌కతా ఆడే తదుపరి మ్యాచుకు కూడా అంపైరింగ్ కోసం ఇతడినే తీసుకురండి', 'గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్ ఈ అంపైర్' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: Sai Pallavi Marriage: సినిమాలు చేయకపోతే.. పెళ్లి చేసేస్తారా! ఆ వార్తలు ఎంత భాదిస్తాయో తెలుసా?

Also Read: Twitter Parag Agarwal: ట్విట్టర్‌ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు ఎలన్ మస్క్ షాక్..? త్వరలో సాగనంపడం ఖాయం..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News