India Corona Deaths: భారత్‌లో కరోనా తగ్గుముఖం, తాజాగా 4,329 COVID-19 మరణాలు
India COVID-19 Cases | కోవిడ్19 తీవ్రత మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులు వైద్యులకు సైతం తలనొప్పిగా మారాయి. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌక్, కర్ఫూల్ కొనసాగిస్తున్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్, 2డీజీ ఔషధాలు సైతం మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి.
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కోవిడ్19 తీవ్రత మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులు వైద్యులకు సైతం తలనొప్పిగా మారాయి. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌక్, కర్ఫూల్ కొనసాగిస్తున్నాయి. ఏపీలో కర్ఫ్యూ పొడిగించారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్, 2డీజీ ఔషధాలు సైతం మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో తాజాగా 2,63,533 మంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,52,28,996 (2 కోట్ల 52 లక్షల 28 వేల 9 వందల 96)కు చేరింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 4,329కు కరోనా మరణాలు సంభవించాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ (CoronaVirus) బారిన పడి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,78,719కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: COVID-19 Vaccine: భారత్‌లో కరోనాపై ఏ వ్యాక్సిన్లు ప్రభావం చూపుతాయో తెలుసా
దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 4,22,436 మంది కరోనా మహమ్మారిని జయించారు. భారత్‌లో ఇప్పటివరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,15,96,512 (2 కోట్ల 15 లక్షల 96 వేల 512)కి చేరింది. దేశంలో ప్రస్తుతం 33 లక్షల 53 వేల 765 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. తాజాగా పాజిటివ్ కేసుల కన్నా డిశ్ఛార్జ్ కేసులు లక్షన్నరకు పైగా అధికంగా ఉండటం స్వల్ప ఊరట. కానీ మరణాలు మాత్రం తగ్గకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశంలో ఇప్పటివరకూ 18 కోట్ల 44 లక్షల 53 వేల 149 మంది కోవిడ్19 టీకాలు(COVID-19 Vaccine) తీసుకున్నారు. మరోవైపు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సినేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేశాయి.
Also Read: COVID-19 For Diabetes Patient: డయాబెటిస్ పేషెంట్లకు కరోనా మరింత ప్రమాదకరం, ఈ జాగ్రత్తలు పాటించండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook