India witnessed a decline in daily COVID-19 cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా తగ్గాయి. కొవిడ్ కేసుల్లో గురువారం స్వల్పంగా పెరుగుదల నమోదవగా.. శుక్రవారం  కొత్త కేసుల సంఖ్య తగ్గి.. రికవరీలు పెరిగాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,318 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) తెలిసింది. మొత్తం 9,69,354 శాంపిళ్లను టెస్టులు చేయగా ఈ కేసులు బయపడ్డట్లు ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది.


ఇదే సమయంలో కొవిడ్ కారణంగా మరో 465 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. 9,868 మంది కొవిడ్ నుంచి తేరుకున్నారు. 


మరిన్ని వివరాలు..


దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,07,019 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,67,933 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్​ మరణాల రేటు 1.35 శాతంగా ఉంది.


ఇప్పటి వరకు దేశంలో 34,563,749 మందికి కరోనా సోకగా.. అందులో 3,39,88,797 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.34 శాతంగా ఉంది.


వ్యాక్సినేషన్ ఇలా..


నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 73,58,017 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,21,06,58,262 వద్దకు చేరింది.


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..


ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 260,908,948 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,206,804 మంది మహమ్మారికి బలయ్యారు. 235,699,215 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 20,002,929 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.


అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, టర్కీ, జర్మనీ, ఫ్రాన్స్​ దేశాల్లో కరోనా ఉదృతి తీవ్రంగా ఉంది. దక్షిణాఫ్రికా వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో చాలా దేశాలు మళ్లీ అప్రమత్తమయ్యాయి.


Also read: Poorest states in India: దేశంలో అత్యంత పేద రాష్ట్రం బిహార్​.. తెలుగు రాష్ట్రాల స్థానం ఎక్కడంటే..


Also read: International Flights: డిసెంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో అంతర్జాతీయ విమానయాన సేవలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook