ఒక్కరోజులో 24,248 కరోనా కేసులు.. అదొక్కటే ఊరట
India Corona Positive Cases | భారత్‌లో వరుసగా రెండోరోజూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 24000కు పైగా నమోదయ్యాయి. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేవరకు ఈ కేసులు, కరోనా మరణాలలో మార్పు వచ్చేలా కనిపించడం లేదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 24,248 కరోనా పాజిటివ్ కేసులు (India CoronaVirus cases) నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య (CoronaVirus cases In India) 6,97,413కి చేరింది. మొత్తం కేసులకుగానూ 4,24,433 మంది చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకొని ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2,53,287 యాక్టివ్ కేసులున్నాయి. అయితే రికవరీ రేటు 60శాతానికి పైగా ఉండటం ఒక్కటే కాస్త ఊరట కలిగిస్తున్న అంశం. Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
అదే సమయంలో దేశ వ్యాప్తంగా కరోనాతో పోరాడుతూ 425 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి దేశంలో చనిపోయిన వారి సంఖ్య 19,693కి చేరింది. తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..