SBI Report on Coronavirus: కరోనా వైరస్ మహమ్మారి ఉధృతిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. మే మూడవ వారానికి కరోనా వైరస్ ఇండియాలో పీక్స్‌కు చేరుకుంటుందని..తట్టుకోవడం కష్టమేనని చెప్పడం ఆందోళన కల్గిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతంగా ఉంది. కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ప్రకంపనలకు తోడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన పరిశోధన నివేదిక ( SBI Research Report) కలకలం రేపుతోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 3 లక్షలు దాటి నమోదవుతున్న క్రమంలో ఒకవేళ దేశంలో మూడో వేవ్‌ వస్తే ( Corona Third wave) తట్టుకోవడం చాలా కష్టమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో తెలిపింది. అమెరికా, జపాన్ వంటి దేశాలలో థర్డ్‌ వేవ్‌ సృష్టించిన విలయాన్ని గుర్తు చేసింది. కరోనా వైరస్ (Corona virus cases)కేసులకు సంబంధించి రెండవ వేవ్ కంటే మూడవ వేవ్ పీక్ ఘోరంగా ఉందని రుజువు చేసిందని నివేదిక పేర్కొంది. అదే విధంగా మే మూడవ వారానికి కరోనా వేవ్‌ పీక్‌ దశకు చేరుకుంటుందని అంచనావేసింది. 


ఫిబ్రవరి 15 నుంచి పీక్ టైమ్‌ను 96 రోజులుగా ఎస్‌బీఐ నివేదిక(SBI Report)అంచనా వేసింది. దీని ప్రకారం మే నెల మూడవ వారంలో కరోనా సెకండ్ వేవ్ పీక్స్‌కు(Corona Second Wave peak stage) చేరుకుంటుంది. ఇండియాలో ఫిబ్రవరి 21 వరకూ రికవరీ రేటు (India recovery rate) 97.3 శాతంకు పెరిగినా..తరువాత పరిస్థితి దిగజారి..85 శాతానికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు పెరుగుతుంటే..ఇండియాలో మాత్రం తగ్గుతోందని పేర్కొంది. ఈ రికవరీ రేటు 78-79 శాతానికి చేరుకున్నప్పుడు కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరుకుంటుందని ఎస్‌బీఐ అధ్యయనం చేసింది.రోగ నిరోధక శక్తి, హార్డ్ ఇమ్యూనిటీ సాధించేందుకు మొత్తం జనాభాకు వ్యాక్సినేషన్(Corona vaccination) అనే ఏకైక లక్ష్యంతో వెళ్లాలని నివేదిక స్పష్టం చేసింది. 


తాజాగా మహారాష్ట్ర(Maharashtra)లో కొత్త కేసుల సంఖ్య అదుపులో వచ్చిందని..కానీ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. ఈ దశలో ఇతర రాష్ట్రాలు కఠినమైన చర్యల్ని అమలు చేస్తే కరోనా వైరస్ సంక్రమణను నియంత్రించవచ్చని నివేదిక స్పష్టం చేసింది. 


Also read: Oxygen Shortage: ఢిల్లీలో కొనసాగుతున్న మృత్యుఘోష, ఆక్సిజన్ అందక 20 మంది మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook