భారత్ వర్సెస్ ఆసీస్: ఎవరు గెలిస్తే వారిదే అగ్రస్థానం
నువ్వా నేనా అన్నట్లు సాగే భారత్-ఆసీస్ పోరు కోసం అందరం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్ కు మరో ప్రత్యేకత ఉంది. ఈ పోరులో విన్నర్ గా నిలిస్తే అగ్రస్థానాన్ని కైవసం చేసుకు అవకాశం ఇరు జట్లకు ఉంటుంది. అయితే కనీసం 4-1 తేడాతో గెలవాల్సి ఉంది. ఎవరైతే ఈ స్థాయిలో విజయాన్ని అందుకుంటారో వారే టాప్ ర్యాంకు సాధిస్తారు. ప్రస్తుతం భారత్, ఆసీస్ చెరో 117 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. కాాగా 119 పాయింట్లతో సౌతాఫ్రికా జట్టు అగ్రస్థానంలో ఉంది. భారత్ లేదా ఆసీస్ లు సిరీస్ ను 4-1 తేడాతో గెల్చుకుంటే 120 పాయింట్ల సాధించి అగ్రస్తాన్ని కైవసం చేసుకునే అవకాశముంది..ప్రస్తుతం ఇరు జట్ల ఫాంను పరిగణనలోకి తీసుకుంటే టీమిండియాకే అగ్రస్థానంలో నిలబడే అవకాశముంది. ఇదే జరిగితే ఇప్పటికే టెస్టుల్లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న కోహ్లీసేన వన్డేల్లోనూ టాప్ ప్లేస్ కైవసం చేసుకొని తిరుగులేని జట్టుగా తయారౌతుంది.