Indian Armed Forces Shortage: భారత త్రివిధ దళాల్లో 1,35,784 మంది సిబ్బంది కొరత ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో ఆర్మీలో అత్యధికంగా 1,16,464 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. అధికారుల, సైనికుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. ప్రతీ ఏటా సగటున ఆర్మీలో 60 వేలు, నేవీలో 5332, ఎయిర్‌ఫోర్స్‌లో 5723 మంది సిబ్బందిని రిక్రూట్‌‌మెంట్ జరుగుతున్నట్లు వెల్లడించింది. కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ రాజ్యసభలో దీనిపై లిఖితపూర్వక సమాధానమిచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం అగ్నిపథ్ స్కీమ్ కింద ప్రతిపాదించిన అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కన్నా వార్షిక రిక్రూట్‌మెంట్ సగటు ఎక్కువగా ఉండే పక్షంలో సాయుధ దళాల్లో సిబ్బంది కొరతను ఎలా అధిగమిస్తారనే ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం చెప్పకపోవడం గమనార్హం. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని మాత్రమే ఆయన బదులిచ్చారు.గత రెండేళ్లుగా ఇండియన్ ఆర్మీలో ఒక్కరిని కూడా రిక్రూట్ చేసుకోలేదా అనే ప్రశ్నకు.. కేంద్రమంత్రి 'లేదు' అని సమాధానమిచ్చారు.


ఈ ఏడాది జనవరి 1 నాటికి ఉండాల్సిన దాని కన్నా ఇండియన్ ఆర్మీలో 1,16,464 మంది సిబ్బంది తక్కువగా ఉన్నారని కేంద్రమంత్రి వెల్లడించారు. జనవరి 1, 2020 నాటికి ఈ సంఖ్య 64,482గా ఉందన్నారు. ఈ ఏడాది మే 31 నాటికి నేవీలో 13,597 మంది, జూలై 1 నాటికి 5723 మంది సిబ్బంది కొరత ఉందన్నారు.


కాగా, త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రప్రభుత్వం 'అగ్నిపథ్' పేరిట కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా త్రివిధ దళాల్లోకి నాలుగేళ్ల కాలపరిమితితో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. నాలుగేళ్ల తర్వాత 25 శాతం మంది మాత్రమే రెగ్యులరైజ్ అవుతారు. మిగతా 75 శాతం మంది ఎగ్జిట్ అవుతారు. ఎగ్జిట్ సమయంలో రూ.12 లక్షల వరకు సేవా నిధి ప్యాకేజీ అందిస్తారు. అయితే ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగ భద్రత ఉండదని.. నాలుగేళ్ల తర్వాత తమ పరిస్థితేంటని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ సహా పలుచోట్ల తీవ్ర ఆందోళనలు చోటు చేసుకున్నాయి. 


Also Read: Rythu Bheema:తెలంగాణ రైతులకు అలర్ట్..  రైతు బీమాలో మార్పులకు ఇవాళ ఒక్కరోజే అవకాశం 


Also Read: Neet Dress Code: లోదుస్తులు చేతుల్లోనే పట్టుకుని వెళ్లమన్నారు.. బాధిత విద్యార్థిని ఆవేదన.. ఐదుగురు మహిళా సిబ్బంది అరెస్ట్..


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook