Surgical strike: యాన్టీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతం
జమ్మూ కశ్మీర్ లో కొనసాగుతున్న యాన్టీ టెర్రరిస్ట్ అపరేషన్
ఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో బాంబులతో విరుచుకుపడిన సైన్యం ఇప్పుడు ...స్వదేశంలోనూ ముష్కరుల ఏరివేత ఆపరేషన్ మొదలెట్టింది. తాజాగా భారత ఆర్మీ చేపట్టిన ఈ ఆపరేషన్ లో ఎన్‌కౌంటర్ జరిపి జైషే మహ్మద్ ముఠాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో ప్రాంతంలో మాటు వేసిన ఉగ్రవాదులన పక్కా ప్రణాళికతో మట్టుబెట్టింది.
ప్రస్తుతం జమ్మూకశ్మీర్ ఉగ్రమూకల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోంది. నిఘా వర్గాల నుంచి సమాచారం ఆధారంగా భద్రతాబలగాలు...నిర్బంధ తనిఖీలు చేస్తున్నారు. మరింత మంది ముష్కరులు తలదాచుకున్నారనే సమచారం నేపథ్యంలో షోపియాన్‌లోని ప్రాంతంలో భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టి సారించాయి.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన సోమవారం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీంతో రగిలిపోతున్న ఉగ్రమూకలు పాక్ సాయంతో పుల్వామా తరహా దాడులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసున్నారు. నిఘావర్గాల నుంచి సమాచారం ఆధారంగా భారత సైన్యం ఉగ్రమూకల ఏరివేత కార్యక్రమాన్ని తిప్పికొడుతోంది.