Indo-china Border: యుద్ధానికి సంసిద్ధమైన భారత ఆర్మీ, టీ90 ట్యాంకుల మొహరింపు
చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు భారతదేశం సన్నద్ధమైంది. సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకుల్ని మొహరించింది. రెండు దేశాల మధ్య ఉద్రక్తత పెరిగిన నేపధ్యంలో భారత్ ఈ చర్యలు తీసుకుంటోంది.
చైనా ( China ) దూకుడుకు చెక్ పెట్టేందుకు భారతదేశం సన్నద్ధమైంది. సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకుల్ని మొహరించింది. రెండు దేశాల మధ్య ఉద్రక్తత పెరిగిన నేపధ్యంలో భారత్ ఈ చర్యలు తీసుకుంటోంది.
భారత చైనా సరిహద్దు ( Indo china Border ) ఉద్రిక్తతల నేపధ్యంలో భారత ఆర్మీ పూర్తిగా సంసిద్ధమైంది. ఇటీవలి కాలంలో దూకుడు పెంచిన చైనాను నియంత్రించేందుకు భారత సైన్యం ( Indian Army ) అప్రమత్తమైంది. ఇప్పటికే యుద్ధానికి ఏ క్షణంలోనైనా సంసిద్ధతను పెంచుకున్న భారతదేశం ఇప్పుడు తూర్పు లడాఖ్( East ladakh ) లో టీ90 ( T 90 ) , టీ 72 ( T 72 ) యుద్ధ ట్యాంకుల్ని మొహరించింది. చుమర్-డెమ్‌చోక్ ప్రాంతంలో నియంత్రణ రేఖ ( ఎల్‌ఏసీ ) వెంబడి యుద్ధ బలగాలతో పాటు ట్యాంకులను తరలించింది. 14 వేల 500 అడుగుల ఎత్తులో చైనా సైనికులతో తలపడేందుకు భారత సేన సాయుధ బలగాలు సిద్ధమయ్యాయి. భారత దేశం టీ-72, టీ-90 ట్యాంకులను మోహరించగా చైనా తేలికపాటి టైప్ 15 ట్యాంకులను మోహరించింది.
ఇరు దేశాల సరిహద్దు ప్రతిష్టంభనతో భారత్-చైనాల మధ్య గత ఐదు నెలలుగా ఉద్రిక్తతలు పెరిగాయి. చైనాత ఎప్పటికప్పుడు ద్వైపాక్షిక ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ భారత భూభాగంలోకి చొచ్చుకురావడంతో పాటు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. గల్వాన్ లోయ ( Galwan valley ) లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన అనంతరం చైనా దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట వేసేందుకు ఇండియా దీటుగానే స్పందిస్తోంది. సరిహద్దు వెంబడి చైనా సైన్యం కుట్రల్ని తిప్పికొడుతూ డ్రాగన్‌ను నిలువరించగలిగింది. ఓ వైపు చైనా దేశంతో దౌత్య, సైనిక సంప్రదింపులు జరుపుతూనే.. డ్రాగన్ దుస్సాహసానికి పాల్పడితే తిప్పికొట్టేందుకు సైతం భారత ఆర్మీ సన్నద్ధమైంది. Also read: Sanjay Raut: శివసేన, అకాలీదళ్ లేని కూటమిని ఎన్డీఏగా పరిగణించను