Indian Army helicopter CRASHES in Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ (Military Chopper) కుప్పకూలింది. ఎగువ సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఇది ఉదయం 10:40 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. "ప్రమాదం జరిగిన ప్రదేశానికి రహదారి సౌకర్యం కూడా లేదు. రెస్క్యూ టీమ్‌ను అక్కడకి పంపించాం''  అని ఎగువ సియాంగ్ పోలీస్ సూపరింటెండెంట్ జుమ్మర్ బసర్ చెప్పారు. కుప్పకూలిన హెలికాప్టర్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH)గా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లాలో భారత సైన్యం యొక్క అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ క్రాష్ గురించి చాలా కలతపెట్టే వార్తలు వచ్చాయి. నా ప్రగాఢ ప్రార్థనలు" అంటూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు ట్వీట్ చేశారు. అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్‌లు స్వదేశీంగా తయారుచేయబడ్డాయి. వీటిని భారత వైమానిక దళం మరియు భారత సైన్యం అధిక ఎత్తులో ఉండే కార్యకలాపాలకు మరియు వైమానిక సహాయాన్ని అందించడానికి ఉపయోగిస్తాయి. ఈ హెలికాప్టర్ లను హెచ్ఏఎల్ తయారు చేసింది. 



నెలలో రెండో సారి...
ఈ ఏడాది అక్టోబరు 5న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో చిరుత హెలికాప్టర్ ప్రమాదంలో భారత ఆర్మీ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన పైలట్‌ను లెఫ్టినెంట్ కల్నల్ సౌరభ్ యాదవ్‌గా గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా తరుచూ  హెలికాప్టర్లు ప్రమాదానికి గురి అవుతాయి. గతంలో హెలికాప్టర్ ప్రమాదంలోనే అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ ప్రాణాలు కోల్పోయారు.


Also Read: Pune: పూణెలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ముగ్గురు కార్మికులు మృతి! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook