సరిహద్దుల్లో ఉగ్రవాదుల వేటకు అగ్రరాజ్యం ఆయుధాలు
జమ్ముకాశ్మీర్ సహా సరిహద్దులన్నింటిలో ముష్కర మూకల ఆటకట్టించడానికి భారత్ మరింత శక్తి కూడగట్టుకుంటోంది. ఇందుకోసం మరోసారి అగ్రరాజ్యం అమెరికా సాయం తీసుకోనుంది. ఉగ్రవాద నిరోధక చర్యల కోసం భారత సైన్యం సిగ్ సావర్ అసాల్ట్ రైఫిల్స్ 10,000ను సమీకరించుకోనుంది.
న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్ సహా సరిహద్దులన్నింటిలో ముష్కర మూకల ఆటకట్టించడానికి భారత్ మరింత శక్తి కూడగట్టుకుంటోంది. ఇందుకోసం మరోసారి అగ్రరాజ్యం అమెరికా సాయం తీసుకోనుంది. ఉగ్రవాద నిరోధక చర్యల కోసం భారత సైన్యం సిగ్ సావర్ అసాల్ట్ రైఫిల్స్ 10,000ను(SiG Sauer assault rifles) సమీకరించుకోనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఒప్పందపై భారత్ సంతకం చేసింది. ఫాస్ట్ ట్రాక్ విధానంలో 72 వేల 400 7.6 మిల్లీ మీటర్ల తుపాకుల సన్నద్ధత కోసం 2019 ఫిబ్రవరి 12న అమెరికాతో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు 700 కోట్ల రూపాయలు.
సరిహద్దు భద్రతకు పెద్దపీట...
పాకిస్తాన్, చైనా సరిహద్దు వెంబడి.. నిరంతరం వస్తున్న బెదిరింపులను దృష్టిలో ఉంచుకుని భారత్.. సాయుధ దళాలను ఆధునికరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే సిగ్ సావర్ రైఫిల్స్ అవసరాన్ని భారత ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ప్రస్తుతం భారత ఆర్మీ వద్ద 5.56*45 మిల్లీమీటర్ల INSAS రైఫిల్స్ మాత్రమే ఉన్నాయి. ఐతే సిగ్ సార్ అసాల్ట్ రైఫిల్స్ INSAS రైఫిల్స్ కంటే అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉన్నాయి.
సిగ్ సావర్ అసాల్ట్ రైఫిల్స్ ప్రత్యేకతలు..
సిగ్ సావర్ అటాక్ రైఫిల్స్ తీవ్రమైన, ప్రతికూల వాతావరణ పరిస్థితులలోనూ విశ్వసనీయతకు ప్రసిద్ది చెందాయి. ఈ రైఫిల్స్‌ను తయారుచేసే సంస్థ వాటిని వ్యూహాత్మక కార్యకలాపాల కోసం ఉపయోగించే విధంగా రూపొందించింది. భారత సైన్యంలో ఇప్పటికే అమెరికన్ ఎం4 ఎ1 అసాల్ట్ రైఫిల్స్ ఉన్నాయి. వీటిని జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక చర్యల కోసం ఉపయోగిస్తున్నారు. ఇండియన్ ఆర్మీని మరింత హై-ఎండ్ కార్బైన్‌లతో సన్నద్ధం చేయాలనుకోవడం వల్ల సిగ్ సావర్ రైఫిల్స్ కొనుగోలు చేస్తున్నారు.